Bandi Sanjay to Delhi : ఢిల్లీకి తనను ఎవరూ పిలువలేదని చెప్పిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రెండు రోజల్లోనే ఢిల్లీ పయనం అయ్యారు. ఆయన బండి సంజయ్ ఢిల్లీ పర్యటనలో బీజేపీ అగ్రనేతలను కలవనున్నారనేది విశ్వసనీయవర్గాల సమాచారం. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లి అక్కడి జాతీయ నేతలను కలిశారు. ఏ అంశంపై కలిశారో స్పష్టత లేదు కానీ.. తెలంగాణ బీజేపీ సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లడంతో వచ్చే కొద్ది రోజుల్లో తెలంగాణ  బీజేపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని భావిస్తున్నారు.  


తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో భారీ మార్పులు ఉంటాయనే ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. ఇప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వాన్ని్ మార్చాలని కొంత మంది డిమాండ్ చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఎన్నికల ముంగిట ఇలా నాయకత్వాన్ని మార్చడం మంచిది కాదని  ఉన్న  వారితోనే స్ట్రాటజీ ఉపయోగించి రాష్ట్రంను కమలంలో కలుపుకోవాలని బీజేపీ పావులు కదుపుతోందని అంటున్నారు.  బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను తమ ఖాతాలో వేసుకుంటే చాలు అత్యధిక మెజారిటీని దక్కించుకోగలుగుతామని అనుకుంటున్నారు బీజేపీ నాయకులు. కర్ణాటక ఫలితాలు కొంత ఇబ్బంది పెట్టడం మాట వాస్తవమేనని కానీ, అక్కడి పరిస్థితులకు ఇక్కడి పరిస్థితులకు తేడా స్పష్టంగా ఉందని అనుకుంటున్నారు. అయితే కర్ణాటక ఫలితాలతో ఊపు మీదున్న కాంగ్రెస్ ను కట్టడి చేసేందుకు బీజేపీ అధినాయకత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.


బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంబయ్ ఏకపక్ష నిర్ణయాలు, దూకుడు పార్టీకి కొంచెం చేటు చేసే ప్రమాదం ఉందని ఇక్కడి నాయకులు భావిస్తున్నారు. పార్టీ పటిష్టత, చేరికలు, గెలుపుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ కొన్ని రోజులు ఉండి పార్టీ కార్యాచరణపై విచారించనున్నారు. బండి సంజయ్ దూకుడుగా ఉన్నా. ఆయన వల్లే తెలంగాణలో బీజేపీకి పట్టు దొరికిందని, ఆయననే ఈ అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకూ కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ స్టేట్ చీఫ్ పదవి కోసం ఈటల కూడా గట్టిగా ప్రయత్రిస్తున్నట్లు తెలుస్తోంది.  బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారు ఈటల రాజేందర్. కానీ చాలా మంది సీనియర్ నాయకులు పార్టీని నమ్ముకొని ఏళ్లుగా కష్టపడుతున్నారు. ఇప్పడు పదవి ఈటలకు ఇస్తే కొత్త సమస్యలు వస్తాయన్న భావనలో మరికొంత మందిఉన్నారు. 


ఈ అసెంబ్లీ ఎన్నికల వరకూ దాదాపు అధ్యక్షడు మారకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బండి సంజయ్ చురుకైన నాయకుడు. ఆయన హయాంలోనే తెలంగాణలో పార్టీ గతంలో కంటే వేగంగా పుంజుకుంది. హిందుత్వ ఎంజెండాను ముందుకు తీసుకుపోవడంతో ఆయన సఫలీకృతుడయ్యాడని చెప్పవచ్చు. గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో దాదాపు 40 మంది వరకూ కౌన్సిలర్లను గెలిపించుకున్నారు.  మోదీ, అమిత్ షాలకు బండి సంజయ్ నాయకత్వంపై మంచి నమ్మకం ఉందంటున్నారు.