గత కొన్ని రోజులుగా వీధి కుక్కల దాడులు ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. స్కూలుకు వెళ్లిన పిల్లలు, లేక ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులపై వీధి కుక్కలు దాడులు చేస్తాయోమోనని ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. కాజీపేట రైల్వే ఆవరణంలోని నూతన చిల్డ్రన్ పార్క్ వద్ద బాలుడిని కుక్క కరిచింది. ఆరేళ్ల బాలుడు ఆడుకుంటున్న టైంలో కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో బాలుడు స్పాట్‌లోనే చనిపోయాడు. 


కాజీపేట ప్రాంతంలో 47, 62, 63 డివిజన్‌లో వీధి కుక్కలు విపరీతంగా సంచరిస్తున్నాయి. సాయంకాలం ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ప్రజలకు జంకుతున్నారు. మార్నింగ్, ఈవినింగ్‌ వాక్ చేయాలన్న ప్రాణాలతో చెలగాటమే అన్నట్టు మారిపోయింది పరిస్థితి. ఒక్కరు కనిపిస్తే చాలు వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి 8 మందికి వీధి కుక్కలు కరిచాయి. ప్రాంతీయ పార్టీ నాయకులైన అధికారులైన స్పందించి వీధి కుక్కల బెడద కాజీపేట పట్టణస్తులకు కల్పించాలని కోరుతున్నారు.


Also Read: స్వప్నలోక్ కాంప్లెక్స్ క్యూనెట్ బాధితుల ఆందోళన, న్యాయం చేసే వరకు పోరాటం ఆపేది లేదని హెచ్చరిక


కుక్కలు దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబాన్ని బీఆర్‌ఎస్‌ లీడర్లు పరామర్శించారు. ఘటనకు గల కారణాలను తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎం.జీ.ఎం.ఆసుపత్రి అవరణలో బాధిత బాలుడి కుటుంబానికి లక్ష రూపాయల చెక్‌ను ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి అందజేశారు. 


Also Read: ఇంటికి తాళం వేసి ఊరెళ్తున్నారా, తస్మాత్ జాగ్రత్త! పోలీసులు చెప్పిన సూచనలివీ 


వరుసగా కుక్కల దాడులు, బలవుతున్న చిన్నారులు!
కొన్ని నెలల కిందట హైదరాబాద్ లోని అంబర్ పేటలో ప్రదీప్ అనే బాలుడు కుక్కల దాడిలో మృతిచెందిన ఘటన మరువక ముందే తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలో వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలో మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. రఘునాథపాలెం మండల పరిధిలోని పుటాని తండా గ్రామ పంచాయతీలో ఈ విషాదం జరిగింది. బానోతు రవీందర్, సంధ్య దంపతులకు చిన్న కుమారుడైన బానోతు భరత్(5) ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అంతలో వీధి కుక్కలు భరత్ పై దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గం మధ్యలోనే బాలుడు మృతి చెందడం తెలిసిందే. 


హన్మకొండలోనూ పెరిగిన వీధి కుక్కల దాడులు 
హన్మకొండలో ఇటీవల వీధి కుక్కలు దాడులు పెరిగిపోయాయి. పట్టణంలోని నాలుగు డివిజన్లలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. రెడ్డి కాలనీ, యాదవ్ నగర్, కృష్ణ కాలనీ, గౌతమ్ నగర్ లలో రెచ్చిపోయాయి. ఒక్కరోజే.. కనిపించిన వారిని కనిపించినట్టు కరిచి అందరినీ గాయపరిచాయి. నిమిషాల వ్యవధిలోనే సుమారు 15 మందిపై దాడి చేయగా.. నాలుగో డివిజన్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ స్పందించారు. వెంటనే డాగ్ స్క్వాడ్ ను పిలిపించి పిచ్చి కుక్కలను పట్టుకొని బంధించారు. మొత్తంగా ఒకే రోజు  నాలుగు కాలనీల నుంచి 32 మంది ఎంజీఎంకు బాధితులు తరలివచ్చారు.