ABP  WhatsApp

Goa Election 2022: 'ఏడుపు ఆపండి సర్! కాంగ్రెస్‌కు వేసే ప్రతి ఓటు భాజపా ఖాతాలోకే'

ABP Desam Updated at: 17 Jan 2022 07:01 PM (IST)
Edited By: Murali Krishna

కాంగ్రెస్‌కు వేసే ప్రతి ఓటు భాజపా ఖాతాలోకే చేరుతుందని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. గోవాలో ఆమ్‌ఆద్మీకి అవకాశం ఇవ్వాలన్నారు.

చిదంబరానికి కేజ్రీవాల్ కౌంటర్

NEXT PREV

ఎన్నికలు దగ్గరపడుతోన్న కొద్దీ నేతల మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. తాజాగా గోవా అసెంబ్లీ ఎన్నికలపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. ఆమ్‌ఆద్మీ, టీఎంసీ పార్టీలు గోవాలో పోటీ చేసి భాజపాయేతర ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నాయి చిదంబరం చేసిన వ్యాఖ్యలకు కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు.







ఏడుపు ఆపండి సర్! కాంగ్రెస్.. భాజపాకు మాత్రమే ఆశాకిరణం.. గోవా ప్రజలకు కాదు. మీ పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేల్లో 15 మంది భాజపాలోకి వెళ్లిపోయారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అది భాజపా ఖాతాలోకే చేరుతుందని మీ పార్టీ రుజువు చేసింది.                                         - అరవింద్ కేజ్రీవాల్, ఆమ్‌ఆద్మీ అధినేత


అంతకుముందు..


గోవా ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ఆప్ సిద్ధంగా ఉందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై చిదంబరం ఘాటుగా స్పందించారు.



నా అంచనా ప్రకారం.. ఆమ్‌ఆద్మీ, టీఎంసీ పార్టీలు భాజపాయేతర ఓట్లను చీల్చడానికే పనికొస్తాయి. అందుకే సంకీర్ణ ప్రభుత్వంలో భాగమయ్యేందుకు ఆప్ సిద్ధంగా ఉందని కేజ్రీ అన్నారు. నా దృష్టిలో గోవా ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా మధ్యే పోటీ ఉంది. 10 ఏళ్ల నుంచి సాగుతోన్న దుర్మార్గమైన పాలన నుంచి మార్పు కోరుకునే వారు కాంగ్రెస్‌కు ఓటు వేస్తారు. ఆ పాలనే కొనసాగాలనుకునే వారు భాజపాకు ఓటేస్తారు.                                            -    పీ చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత


Also Read: Punjab Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా.. ఫిబ్రవరి 20న పోలింగ్


Also Read: Covid Vaccine for Children: గుడ్‌న్యూస్.. 12-14 ఏళ్ల పిల్లలకు అప్పటి నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ!


Also Read: Omicron Cases: భారత్‌లో కాస్త శాంతించిన కరోనా మహమ్మారి.. మరోవైపు 8 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


Published at: 17 Jan 2022 07:05 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.