పీఎం కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన కింద ఇప్పటికే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది కేంద్రం. 12  కోట్లమంది రైతులు ఈ పథకం ద్వారా నేరుగా లబ్ధి పొందుతున్నారు. పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో  కిసాన్ సమ్మాన్‌ నిధి వెబ్‌సైట్‌లో చాలా మార్పులు చేసింది కేంద్రం. ఈ మార్పులు కారణంగా కొని సులభతర మైన సేవలను రైతులు కోల్పోనున్నారు. 
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన వెబ్‌సైట్‌లో ఏడు మార్పులు చేసింది కేంద్రం. ఇప్పటికే ఈ కేవైసీపీ తప్పని సరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొన్ని కారణాల వల్ల దీన్ని హోల్డ్ చేసి పెట్టింది. ఇప్పుడు చేసిన మార్పులు రైతులకు కాస్త ఇబ్బంది కలిగించేదిగానే ఉంది. 


ఇప్పటి వరకు రైతులు తమ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేదా.. స్టేటస్ ఏంటో తెలుసుకునేందుకు మూడు మార్గాలు ఉండేవి.  వెబ్‌సైట్‌లోకి వెళ్లి స్టేటస్‌పై క్లిక్‌ చేసి ఆధార్‌ నెంబర్‌గానీ, మొబైల్‌ నెంబర్‌గానీ, బ్యాంకు అకౌంట్‌ నెంబర్‌గా ఎంటర్ చేస్తే పూర్తి వివరాలు వచ్చేవి. అకౌంట్‌లో అమౌంట్‌ పడిందా లేదా.. అప్లికేషన్ ఏ పొజిషన్‌లో ఉందో తెలిసిపోయేది. 


ఇప్పుడు చేసిన మార్పుల ప్రకారం ఇది క్లిష్టతరం కానుంది. ఇకపై మొబైల్‌ నెంబర్‌ కొట్టి స్టేటస్‌ తెలుసుకోవడాన్ని పూర్తిగా తీసేశారు. స్టేటస్‌ తెలుసుకోవాలంటే మాత్రం ఆధార్ కార్డు నెంబర్‌గానీ, బ్యాంకు అకౌంట్‌ నెంబర్‌ కానీ తెలిసి ఉండాలి. 


మొబైల్‌ నెంబర్‌ ఎంటర్‌ చేస్తే స్టేటస్‌ తెలుసుకోవడం చాలా సులభతరమైన ప్రక్రియే కానీ  దీని వల్ల చాలా జరిగే దుష్పరిణామాలు గుర్తించిన కేంద్రం ఈ ఆఫ్షన్  తీసేసింది. చాలా మంది ఇతరుల ఫోన్ నెంబర్ తెలుసుకొని వారి వివరాలు ట్రాప్ చేస్తున్నారని.. భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్రం ఈ మార్పులు చేసింది. 


జనవరి ఒకటిన పీఎం కిసాన్ పథకం పదో ఇన్‌స్టాల్‌మెంట్‌ను కేంద్రం వేసింది. ఇప్పటికే చాలా మంది ఈ డబ్బులు అందుకున్నారు. ఇప్పటికే అందుకోని వారు ఆందోళన చెందాల్సిన పని లేదంటున్నారు అధికారులు. మార్చి వరకు ఎప్పుడైనా డబ్బులు పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. 


Also Read: ట్విట్టర్ వేదికగా పరస్పరం ట్వీట్లు విసురుకుంటున్న వైసీపీ ఎంపీలు


Also Read: సీఐడీ విచారణకు రఘురామ డుమ్మా.. 4వారాల సమయం కావాలని లేఖ !


  Also Read: తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు పొడిగించండి.... సీఎం జగన్ కు నారా లోకేశ్ లేఖ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి