From 73 Rejections To Rs 52,000 Crore Unicorns Build This Startup Couples :  స్టార్టప్ కాలంలో ఓ ఐడియానే  వేల కోట్ల వ్యాపారాన్ని పుట్టిస్తుంది. స్టార్టప్ గా ప్రారంభించి యూనికార్న్ గా ఎదిగిపోతూంటాయి కంపెనీలు. అంతా కలిపి..నాలుగైదు ఏళ్లలోనే సాధ్యమవుతాయి. జెప్టో ఫౌండర్లు ఇద్దరికి పట్టుమని ఇరవై రెండేళ్లు ఉండవు.. కానీ ఇప్పుడు వారి బిలియనీర్లు. వారికి పెట్టుబడి పెట్టిన వారు కూడా బిలియనీర్లు అయిపోయారు. అక్కడ ట్విస్ట్ ఏమిటంటే వారిని నమ్మిన పెట్టుబడిదారుల అదృష్టమే. చాలా మంది పెట్టుబడిదారులు ఇలా తమ కాళ్ల దగ్గరకు వచ్చిన అదృష్టాన్ని తోసేసుకుంటూ ఉంటారు. దానికి నిదర్శనం ఈ స్టార్టప్ కపుల్స్ కు ఎదురైనా అనుభవాలే.    


దేశంలో రెండు యూనికార్న్‌లుగా ఎదిగిన రెండు బిజినెస్‌లు అఫ్‌బిజినెస్, ఆక్సిజో. ఈ రెండింటిని భార్యభర్తలు అయిన రుచి కల్రా, ఆశిష్ మహాపాత్ర ప్రారంభించారు. మెకిన్సేలో కొంత కాలం పని చేసిన తర్వాత సొంతంగా స్టార్టప్ లు పెట్టుకోవాలని బయటకు వచ్చారు. తమ ఐడియాలతో.. పనితీరుతో .. తమ వద్ద ఉన్న పెట్టుబడితో కొంత వరకూ ముందుకెళ్లగలిగారు. ఇన్వెస్టర్లు దొరికితే ఇక పూర్తి స్థాయిలో విజృంభించవచ్చు అనుకుంటూ... పెట్టుబడిదారుల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎంజెల్ ఇన్వెస్టర్ల దగ్గర నుంచి సీరియల్ ఇన్వెస్టర్ల వరకూ అందర్నీ కలిశారు. మొత్తంగా 73 మందిని కలిశారు. కానీ 73 సార్లు ఆయా పెట్టుబడిదారులు వీరి ఐడియాల్ని  రిజెక్ట్ చేశారు. 


యూకే అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఫాస్ట్ - పదిహేనేళ్లకే కానిచ్చేస్తున్నారట !


పెట్టుబడిదారులు అన్ని సార్లు తిరస్కరించినా ఈ స్టార్టప్ కపుల్ ఏ మాత్రం నిరాశపడలేదు. తమ ఐడియాలు.. తమ కష్టంపై వారికి నమ్మకం ఉంది. తాము ఎంచుకున్న రంగంలో స్టార్టప్ కు పెట్టుబడి దొరికితే తిరుగులేని స్థానాలకు వెళ్తాయని వారికి తెలుసు. అందుకే 74వ ప్రయత్నం కూడా చేశారు. అక్కడే వారికి కలిసి వచ్చింది. పెట్టుబడి వచ్చింది. మొదట ఆర్థిక సేవల స్టార్టర్ ఆక్సిజోను ప్రారంభించారు. ఇప్పుడు అది యూనికార్న్ స్టేజ్ కు వెళ్లింది. తర్వాత అఫ్‌బిజినెస్ పేరుతో మరో స్టార్టప్ ను ప్రారంభించారు. అది ఇంకా  సక్సెస్ అయింది. ఇప్పుడు రెండు స్టార్టప్‌ల విలువ ఏకంగారూ. 52  వేల కోట్ల రూపాయలు.                         


ట్రాక్‌ దాటుతుండగానే దూసుకొచ్చిన ట్రైన్‌, మధ్యలో ఇరుక్కుపోయిన మహిళ - అంతలో ఏం జరిగిందంటే?


సాదారణంగా ఏదైనా స్టార్టప్ వాల్యూ ఒక బిలియన్ డాలర్ల వాల్యూ దాటితే దాన్ని యూనికార్న్ గా పేర్కొంటారు. ఆ దశ దాటితే.. బడా కంపెనీగా రూపాంతరం చెందినట్లే. ఇలా ఈ  స్టార్టప్ కపుల్ ప్రారంభించిన రెండు స్టార్టప్ లు యూనికార్న్‌లు గా మారాయి. వీరిద్దరూ స్టార్టప్ కపుల్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నారు. వీరికి పెట్టుబడి పెట్టిన వారు కూడా భారీగా తమ పెట్టుబడి విలువను పెంచుకున్నారు. అందుకే.. పెట్టుబడిదారులు ఎంత పండిపోయినా యువత ఐడియాల్లో లోతుల్ని తెలుసుకునే సామర్థ్యం కూడా ఉండి ఉండాలంటారు పెద్దలు.