Stree 2 box office collection day 14: అందాల నటి శ్రద్ధాదాస్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలు పోషించిన హారర్ కామెడీ మూవీ ‘స్త్రీ 2‘ బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ‘స్త్రీ 2‘ మరో మైలు రాయిని దాటింది. బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన 6వ చిత్రంగా నిలిచింది. అంతేకాదు, ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ సినిమాలు దేశ వ్యాప్తంగా సాధించిన నెట్ కలెక్షన్స్ ను అధిగమించింది.      


‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ రికార్డులు బ్రేక్


 'స్త్రీ 2' రిలీజైన రెండువారాల్లోనే బాక్సాఫీస్ దగ్గర రూ.445 కోట్లు వసూళు చేసింది. గతంలో రాజమౌళి చిత్రం 'బాహుబలి: ది బిగినింగ్' దేశీయంగా రూ. 421 కోట్లు నెట్ కలెక్షన్స్‌ వసూలు చేసింది. తాజాగా ఆ సినిమా రికార్డును  'స్త్రీ 2' బ్రేక్ చేసింది. ‘కేజీఎఫ్’ సాధించిన రూ. 435 కోట్ల రికార్డును సైతం అధిగమించింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటోంది. అత్యధిక వసూళ్లు సాధించిన 6వ చిత్రంగా నిలిచిన ‘స్త్రీ 2’ ఇదే రోజు కొనసాగితే మరిన్ని రికార్డులను నెలకొల్పే అవకాశం ఉంది.  ప్రస్తుతం బాలీవుడ్ లో 'గదర్ 2' రూ. 525.7 కోట్లతో ఆ తర్వాత స్థానంలో ఉండగా, 'పఠాన్' రూ. 543.09 కోట్లు, 'యానిమల్'  రూ. 553.87 కోట్ల వసూళ్లతో ముందున్నాయి. అయితే, మూడో వారంలోగా ‘స్త్రీ 2’ రూ. 500 కోట్ల నెట్ కలెక్షన్లను అధిగమిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. అయితే, షారూఖ్‌ ఖాన్‌ మూవీ ‘జవాన్’ రూ.640 కోట్ల నెట్ కలెక్షన్స్ ను అదిగమించడం ‘స్త్రీ 2’కు సాధ్యం కాకపోవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కానీ, ‘స్త్రీ 2’కు మంచి వసూళ్లు వస్తున్న నేపథ్యంలో ఏదైనా జరుగొచ్చని అభిప్రాయపడుతున్నాయి.






బాక్సాఫీస్ దగ్గర నో కాంపిటీషన్  


అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ మూవీలోవరుణ్ ధావన్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించాడు. అపర్‌శక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలు పోషించారు. మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ తో ఆకట్టుకుంది.  2018లో విడుదలైన ‘స్త్రీ’ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ మంచి ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. ఈ వారంలోనూ బాలీవుడ్‌లో పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడంతో ‘స్త్రీ-2’ జోరు కొనసాగే అవకాశం ఉంది. ఆగష్టు 30న కూడా పెద్ద స్టార్ల సినిమాలు ఏవీ రావడం లేదు. దీంతో మరిన్ని రికార్డులు నెలకొల్పే అవకాశం ఉంది.  


Read Also: తమన్నా డ్యాన్స్‌ కు ప్రియుడు ఫిదా, విజిల్స్ వేస్తూ ఒకటే సందడి, వీడియో వైరల్



Read Also: ఆ హీరో నా లవ్ ను రిజెక్ట్ చేశాడు- ఫస్ట్ క్రష్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన ‘స్ట్రీ 2‘ బ్యూటీ