Shraddha Kapoor Varun Dhawan Love: బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ రీసెంట్ గా ‘స్త్రీ 2‘తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. 5 రోజుల్లోనే ఈ మూవీ రూ. 228 కోట్లకు పైగా వసూళు చేసింది. 2018లో వచ్చిన ‘స్త్రీ‘ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన  చిత్రం బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధాకపూర్ తన తొలి ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.  


అతడే నా ఫస్ట్ క్రష్- శ్రద్ధా కపూర్


‘స్ట్రీ 2‘ సినిమాలో వరుణ్ ధావన్ అతిథి పాత్రలో కనిపించాడు. శ్రద్ధా కపూర్ తో కలిసి ఓ పాటలోనూ నటించాడు. అయితే, శ్రద్ధా అప్పట్లో వరుణ్ తో ప్రేమలో పడినట్లు చెప్పింది. కానీ, తన ప్రేమను అతడు రిజెక్ట్ చేసినట్లు వెల్లడించింది. వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ చిన్నప్పటి నుంచి ఒకరికొకరు తెలుసు. వరుణ్ ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ కొడుకు కాగా.. శ్రద్ధా నటుడు శక్తి కపూర్ కూతురు. అప్పట్లో డేవిడ్, శక్తి కలిసి ఓ సినిమా చేస్తున్నప్పుడు వరుణ్, శ్రద్ధా షూటింగ్ దగ్గరికి వెళ్లారు. ఆ సమయంలో శ్రద్ధా వరుణ్ ను ఇష్టపడింది. తన ప్రేమను అతడితో చెప్పింది. కానీ, వరుణ్ ఆమె ప్రపోజల్ ను రిజెక్ట్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా శ్రద్ధా వెల్లడించింది. “మేం మా నాన్న సినిమా షూటింగ్ చూడ్డానికి వెళ్లాం. వరుణ్ కూడా వచ్చాడు. చినప్పుడు వరుణ్ మీద నాకు లవ్ ఏర్పింది. మేం ఓ కొండ మీదికి వెళ్లాం. అక్కడ చాలా సేపు ఆడుకున్నాం. అప్పుడు “వరుణ్ నేను ఒకటి తప్పుగా చెప్తాను, నువ్వు సరిచేయాలి” అన్నాను. “సరే అన్నాడు”. నేను “ఐ లవ్ యూ” అన్నాను. “నాకు అమ్మాయిలంటే ఇష్టం ఉండదు” అని చెప్పి పారిపోయాడు” అని చిన్ననాటి సరదా విషయాన్ని గుర్తు చేసుకుంది.  


మూడు సినిమాల్లో నటించిన శ్రద్ధా, వరుణ్


చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ గా ఉన్న వరుణ్, శ్రద్ధా ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. ఇద్దరు కలిసి మూడు సినిమాల్లో నటించారు. ‘ఏబీసీడీ 2’, ‘స్ట్రీట్ డ్యాన్స్ 3డి’తో పాటు ‘స్ట్రీ 2’లోనూ నటించారు. ‘స్త్రీ 2’ సినిమాలో ‘ఖుబ్ సూరత్’ అనే పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ పాటలో వీరిద్దరి ఫర్ఫార్మెన్స్ ప్రేక్షకులను బాగా అలరించింది.  


‘స్త్రీ’కి సీక్వెల్ గా వచ్చిన ‘స్త్రీ 2’


2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘స్త్రీ’ సినిమాకు సీక్వెల్ గా ‘స్త్రీ 2’ తెరకెక్కింది. ఈ సినిమా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రం వరుణ్ ధావ, తమన్నా, అక్షయ్ కుమార్ గెస్ట్ రోల్స్ పోషించారు. 



Also Read: ఒకే వేదికపైకి అల్లు అర్జున్ - సుకుమార్... మారుతి నగర్ ఈవెంట్‌లో 'పుష్ప 2' పుకార్లకు చెక్!?