Mekathoti Sucharita: మాజీ హోం మంత్రి సుచరిత నేడు సీఎం వైఎస్ జగన్‌తో భేటీ కానున్నారని తెలుస్తోంది. ఇతర సీనియర్ నేతలతో సజ్జల, సీఎం జగన్ ఇదివరకే చర్చలు జరిపారు. మరోవైపు మంగళవారమే సీఎం జగన్‌తో భేటీ కలవాల్సి ఉన్నా, బుధవారానికి వాయిదా వేసుకున్నారని సమాచారం. కేబినెట్ కూర్పుతో తనతో కనీసం చర్చించలేదని, సజ్జల సహా పెద్దల్ని కలిసేందుకు ఆ సమయంలో తనకు అవకాశం ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. ఇతర నలుగురు ఎస్సీ మంత్రులకు రెండో కేబినెట్‌లోనూ ఛాన్స్ ఇచ్చిన వైఎస్ జగన్ తనను మాత్రమే ఎందుకు పక్కకుపెట్టారో చెప్పాలని అడుగుతున్నారు. 


ప‌ట్టువీడ‌ని మాజీ హోం మంత్రి సుచ‌రిత‌
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర మాజీ హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత (Former Home Minister Mekathoti Sucharita) వ్య‌వ‌హ‌రం సంచ‌ల‌నంగా మారింది. మొన్నటివరకూ హోం మంత్రిగా ప‌ద‌విలో ఉండి, తాజా మాజీ అయిన ఆమెను ఇప్పుడు పార్టిలో ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌టం లేద‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. తాజాగా జ‌రిగిన మంత్రి వ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్దీక‌ర‌ణ‌ (AP New Cabinet)లో సినియ‌ర్ ల జాబితాతో పాటుగా సామాజిక వ‌ర్గాల స‌మీక‌ర‌ణాల్లో సుచ‌రిత‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేదు. మొదటినుంచీ వైఎస్ఆర్ కుటుంబాన్ని న‌మ్ముకున్న సుచ‌రిత‌, వైఎస్ఆర్ ఉండ‌గానే ఆయ‌న‌కు అత్యంత ఆప్తురాలుగా ముద్ర‌వేసుకున్నారు. 


వైసీపీలో ప్రాధాన్యం ఉన్న మహిళా నేత.. కానీ! 
వైసీపీ ప్ర‌భుత్వంలో సీఎం వైఎస్ జగన్ ఆమెకు ప్రాధాన్య‌త ఇచ్చారు. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే ఎకంగా హోం మంత్రి ప‌ద‌వి ఇచ్చి జ‌గ‌న్ గౌర‌వించారు. అంతే కాదు గ‌తంలో ప‌త్తిపాడు ఉప ఎన్నిక‌లో కూడ సుచ‌రిత వైసీపీ నుండి గెలుపొంది విజ‌యం సాదించారు. వైఎస్ కుటుంబానికి ద‌గ్గ‌ర‌గా ఉండ‌టంతో ఆమెకు వైసీపీ పార్టీలో కూడ త‌గిన ప్రాధాన్య‌త ల‌భించిది. సామాజిక వ‌ర్గం ప‌రంగా కూడా సుచ‌రితకు పార్టి ప‌ద‌వులు వ‌రించాయి. 


సుచ‌రిత భ‌ర్త ద‌యా సాగ‌ర్ ఆదాయ‌పు ప‌న్ను అధికారి, ఆయ‌న‌కు విజ‌య‌వాడ‌లో పోస్టింగ్ ఇచ్చిన స‌మ‌యంలో రాష్ట్ర హెం మంత్రిగా ఉన్న ఆమె.. భ‌ర్త ప్ర‌భుత్వ శాఖ‌లో కీల‌కంగా ఉంటే ఇబ్బందులు వ‌స్తాయ‌నే ఉద్దేశంతో నాలుగు రోజుల‌కే ఆయ‌న్ను అక్క‌డ నుండి బ‌దిలీ చేయించార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. బ‌దిలీ జ‌రిగిన కొద్ది రోజులకే జ‌గ‌న్ క్యాబినేట్ నుండి సుచ‌రిత అవుట్ అవ్వాల్సి వ‌చ్చింది. ఈ రెండు ప‌రిణామాలు వ‌రుస‌గా జ‌ర‌గ‌టంతో ఆమె ఒకింత అస‌హ‌నానికి గుర‌య్యారు. రెండు రోజులు పాటు సుచ‌రిత ఇంటి వ‌ద్ద ఆమె అనుచ‌రులు ఆందోళ‌న‌లు చేశారు. 


ఎంపీ మోపిదేవి నచ్చజెప్పినా వినని మాజీ మంత్రి 
రాజ్య‌స‌భ స‌భ్యుడు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ ఆమెకు న‌చ్చ‌చెప్పేందుకు ప్ర‌య‌త్నించినా ప‌ట్టించుకోలేదు. త‌న శాస‌న స‌భ్య‌త్వానికి కూడ రాజీనామా చేసి ,పార్టిలో మాత్రం కొన‌సాగుతాన‌ని చెప్పారు. అయితే ఇంత జ‌రిగినా పార్టి ప‌రంగా పెద్ద నాయ‌కులు ఎవ్వ‌రూ ఆమెను క‌నీసం ప‌రామ‌ర్శించ‌లేదు. మంత్రి ప‌ద‌వులు రాని ఎమ్మెల్యేలు పార్ద‌సార‌ది, ఉద‌య భాను, విప్ పిన్నెల్లిని సీఎం జ‌గ‌న్ (AP CM YS Jagan Mohan Reddy) స్వ‌యంగా ప‌లిచి మాట్లాడారు కాని,హోం మంత్రిగా ప‌ని చేసిన సుచ‌రిత‌ను మాత్రం ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. దీంతో ఆమె ఆవేద‌న అంతా ఇంతా కాదు. పార్టిని న‌మ్ముకున్న త‌న‌కు చివ‌ర‌కు ఇలాంటి ప‌రిస్దితి వ‌స్తుంద‌ని అనుకోలేద‌ని ఆమె మ‌నో వేదన‌కు గుర‌వుతున్నార‌ని ఆమె మద్దతుదారులు, అనుచరులు చెబుతున్నారు. మ‌రి ఈ అంశం ఎన్ని మ‌లుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
Also Read: Tammineni Seetharam : వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు, మంత్రి పదవి దక్కకపోవడంపై తమ్మినేని హాట్ కామెంట్స్


Also Read: Pawan Kalyan : లక్ష ఇచ్చి చేతులు దులుపుకొని వెళ్లిపోను - కౌలు రైతుల బిడ్డల కోసం ప్రత్యేక నిధి : పవన్ కల్యాణ్