Pawan Kalyan : కౌలు రైతుల కుటుంబాలు కష్టాల నుంచి గట్టెక్కవరకు జనసేన అండగా ఉంటుందన్నారు ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్. అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పపరామర్శించారు. జిల్లాలోని మన్నిల గ్రామ రచ్చబండలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... కౌలు రైతు కుటుంబాలకు రాజకీయ లబ్ధి కోసం సాయం చేయలేదన్నారు. తనదీ రైతు నేపథ్య కుటుంబమే అన్నారు. రైతు కష్టం తెలిసిన వాడినని పవన్ అన్నారు. తాను కూడా స్వయంగా వ్యవసాయం చేశానన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డుల్లేక ప్రభుత్వ పథకాలు అందడంలేదన్నారు. ఏళ్ల తరబడి అప్పులు పేరుకు పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఎవరూ లేరన్న భయంతోనే ప్రాణాలు తీసుకుంటారని పవన్ అన్నారు. నాలుగు నియోజకవర్గాల్లో ఫ్యామిలీని పరామర్శించినప్పుడు వాళ్లు చెప్పే బాధలు వింటే కడపు తరుక్కుపోతుందన్నారు. 


వారి బిడ్డల భవిష్యత్ బాధ్యత నాదే 


"ఇలాంటి వారికి బాధ్యతలు పట్టించుకొని కన్నీటిని తుడవలేనప్పుడు అధికారం ఎందుకు. ఎంత మెజారిటీ వస్తే ఏం ప్రయోజనం. నా వద్ద వేల కోట్లు డబ్బులు ఉన్న వాడిని కాదు. నేను సినిమాలు చేస్తేనే డబ్బులు వచ్చేది. నా పిల్లల పిల్లలకు డబ్బులు దాచుకోవాలన్న ఆశలేదు. అన్నం పెట్టే రైతుకు కులం లేదు. నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. ఇప్పటి వరకు ముప్పై కుటుంబాల బాధలు తెలుసుకున్నాం. లక్ష ఇచ్చి చేతులు దులుపుకొని వెళ్లిపోవడం కాదు.. వారి బిడ్డల భవిష్యత్‌కు బాధ్యత తీసుకుంటాం. కౌలు రైతు కుమార్తేను ఎస్సైను చేస్తాను. చనిపోయిన కౌలు రైతుల బిడ్డల భవిష్యత్‌ కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తాం. సగం నేను ఇస్తాను. మిగతాది జనసేన నాయకులు ఇస్తారు." అని పవన్ అన్నారు. 



వైసీపీ చర్లపల్లి సెటిల్డ్ టీం 


కరోనా టైంలో చనిపోయినా వారి వివరాలను రైతు స్వరాజ్య వేదిక నివేదిక అందించిందని పవన్ అన్నారు. రైతులు ఎంతమంది చనిపోయారనే వివరాలు సేకరించామన్నారు. ప్రభుత్వం వద్ద కూడా ఈ సమాచారం లేదన్నారు. ఎందుకంటే జనసేనకు మనసు ఉంది కాబట్టి కౌలు రైతు కుటుంబాల కన్నీరు తుడుస్తామన్నారు. కౌలు రైతుల గురించి మాట్లాడుతుంటే... తనను వ్యక్తిగతంగా తిడుతున్నారని పవన్ అన్నారు. సీబీఎన్ దత్తపుత్రుడు అని విమర్శిస్తున్నారన్నారు. మీరు సీబీఐకి దత్తపుత్రుడని, వైసీపీ నాయకులందర్నీ ఏదో రోజు సీబీఐ దత్తత తీసుకుంటుందని విమర్శించారు. జనసేన ఎవరికీ బీ టీం కాదని వైసీపీ చర్లపల్లి సెటిల్డ్ టీం అన్నారు. 


ప్రతీ కౌలు రైతు కుటుంబానికి ఏడు లక్షలు 
 
ప్రతీ కౌలు రైతు కుటుంబానికి ఏడు లక్షలు రావాల్సి ఉందని, అవి వచ్చే వరకు జనసేన పోరాడుతుందన్నారు. కౌలు రైతులకు కార్డులు రావాలన్నారు. కౌలు రైతులకు కౌన్సెలింగ్ చేయాలన్నారు. తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు నాగబాబు కౌన్సెలింగ్ చేశారన్నారు. అలాగే కౌలు రైతులకు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. ఆ కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడాలని కోరారు. జనసైనికులు దీని కోసం పనిచేస్తుందన్నారు.