Pawan Kalyan : జనసేన చేపట్టిన రైతు భరోసా యాత్ర(Rythu Bharosa Yatra) అనంతపురం(Anantapur)లో కొనసాగుతోంది. అనంతపురంలో జనసేనాని(Janasenani) పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల(Tenant Farmers) కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకూ జనసేన పోరాడుతుందని స్పష్టం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను గుర్తించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల వంతున ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు.  జనసేన పర్యటనను దృష్టిలో పెట్టుకుని ఆగమేఘాల మీద కౌలు రైతులకు ఏడు లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తుందని పవన్ అన్నారు. తన పర్యటనకు ముందే అందరికీ న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకొని ఉంటే హర్షించే వాళ్లమన్నారు. 






"వైసీపీ నాయకులు చంద్రబాబు(Chandrababu)కు దత్తపుత్రుడిగా నన్ను మరోసారి అంటే జగన్ సీబీఐకి దత్తపుత్రుడిగా అనాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీకి బీటీమ్ గా జనసేన పార్టీని వ్యవహరిస్తే వైసీపీని చర్లపల్లి జైలు షటిల్ టీంగా పిలవాల్సి వస్తుంది." అని పవన్ కల్యాణ్ అన్నారు.  


అనంత రైతులను ఆదుకుంటాం 


అనంతపురం భూములు సస్యశ్యామలంగా ఉండాలనేది జనసేన కోరిక అని పవన్ అన్నారు. అనంత రైతులు ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని జనసేన పార్టీ(Janasena Party) ప్రయత్నిస్తోందన్నారు. బాబు అనే ముస్లిం రైతును అనర్హుడిగా భావించి ఆ కుటుంబానికి ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వలేదన్నారు. ఆ కుటుంబాన్ని జనసేన అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. వారి కూతురు హసీనా చదువుకు, కుటుంబ పోషణకు ఆర్థిక సహాయం చేయబోతున్నామని పవన్ తెలిపారు. ఇజ్రాయిల్(Isreal) లాంటి దేశంలోనూ అనంతపురం లాంటి భూములు ఉంటాయని, కానీ ఆ దేశంలో సాంకేతికతతో పంటలను పండిస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఇక్కడ రావాలన్నారు.