నెట్‌ఫ్లిక్స్  మరింత ఆకర్షణీయంగా మారనుందని సంస్థ ప్రకటించింది రేటింగ్ సిస్టమ్ మారుస్తున్నట్టు తెలిపింది. రికమండేషన్‌ను మరింత మెరుగుపరిచేందుకు కొత్త విధానం తీసుకొచ్చినట్టు మంగళవారం ప్రకిటంచిందా సంస్థ. వినియోగదారులు మరింత సులభంగా నచ్చిన చిత్రానికి లేదా వెబ్‌ సిరీస్‌కు "డబుల్ థంబ్స్ అప్" ఇవ్వడానికి అనుమతిస్తుంది.


"నెట్‌ఫ్లిక్స్‌లో ఏదైనా నచ్చితే దాన్ని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సహోద్యోగులకు చెప్పాలనుకుంటున్నారు. దాని గురించి సోషల్‌ మీడియాలో చర్చించాలనుకుంటారు. అది మరింత సులభంగా జరగాలని కోరుకుంటారు. అందుకే డబుల్ థంబ్స్ అప్‌ని పరిచయం చేస్తున్నాం. మీరు ఏ రకమైన సిరీస్‌లు, చిత్రాలను ఎక్కువగా చూడాలనుకుంటున్నారో మాకు తెలియజేయడానికి సభ్యులకు ఇదో మంచి ఉత్తమ మార్గం. ఆయా సినిమాలు, సిరీస్‌లకు థంబ్స్ అప్, థంబ్స్ డౌన్ బటన్‌లు ఎంపిక చేసి అభిప్రాయాన్ని చెప్పవచ్చు. వెబ్, ఆండ్రాయిడ్, iOS మొబైల్ అన్ని యాప్స్‌లో ఇది ప్రారంభమైంది." అని నెట్‌ఫ్లిక్స్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ డైరెక్టర్ క్రిస్టీన్ డోయిగ్-కార్డెట్ ఒక ప్రకటనలో తెలిపారు.


ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన థంబ్స్ అప్, థంబ్స్ డౌన్ రేటింగ్ బటన్‌లు ద్వారా వినియోగదారులు తమ అభిప్రాయాలు కచ్చితంగా చెప్పడానిక వీలు కలిగిస్తాయని నెట్‌ఫ్లిక్స్‌ భావిస్తోంది. సిరీస్ లేదా ఫిల్మ్ చూసిన తర్వాత ఫీలింగ్‌ ఎలా ఉందనే విషయాన్ని నేరుగా చెప్పడానికి వీలు కల్పిస్తాయిని అంటోంది. దీని వల్ల వారి అభిరుచులకు అనుగుణంగా కంటెంట్‌ను ప్రొనైడ్‌ చేయడానికి.. క్రియేట్ చేసిన కంటెంట్‌ వారికి సిఫార్సు చేసే ఛాన్స్ ఉందని అభిప్రాయపడింది. డబుల్ థంబ్స్ అప్ బటన్ భారతదేశంలో కూడా అందుబాటులో ఉంది. అయితే ఇది దశలవారీగా రోల్ అవుట్‌లో Android మరియు iOSలోని వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది.











మీరు ఇష్టపడే అంశాలపై మరిన్ని వెబ్‌సిరీస్‌లు, సినిమాలు వచ్చేలా చేసేందుకు ఈ డబుల్‌ థంబ్స్‌ అప్‌ చాలా ఉపయోగపడుతుంది. మీకు ఏం కావాలో తెలుసునే ఛాన్స్ మాకు లభిస్తుంది. మీరు నచ్చే అంశాలపై ఎక్కువ ఫోకస్ చేసి కంటెంట్‌ ఇచ్చే ఆలోచన మేం చేస్తాం. ఉదాహరణకు, మీరు బ్రిడ్జర్టన్‌ని ఇష్టపడితే, దాంట్లో నటించిన నటులు, ఇతర క్రూ కి సంబంధించిన ఇతర షోలు, సినిమాలు మీకు అందించగలుగుతాం." అని డోయిగ్-కార్డెట్ చెప్పారు.