Brooklyn Subway Shooting: గన్ కల్చర్ అమెరికాలో మరోసారి సమస్యగా మారింది. గతంలో ఎన్నోమార్లు తుపాకీ మోతతో దద్దరిల్లిన అమెరికాలో మరో కాల్పుల మోత మోగింది. న్యూయార్క్ బ్రూక్లిన్‌ సబ్‌వే స్టేషన్‌  Brooklyn Subway Station) వద్ద ఓ అగంతకుడు జరిపిన కాల్పుల్లో 10 మంది చనిపోయారు. మరో 13 మంది వరకు గాయపడ్డట్లు సమాచారం. బ్రూక్లిన్ సబ్ వే వద్ద మంగళవారం జరిగిన కాల్పుల ఘటనపై న్యూయార్క్ అధికారులు బుధవారం ఉదయం అధికారిక ప్రకటన చేశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సైతం అధికారులు పేర్కొన్నారు.


కాల్పులు జరిపింది ఇతడే..
సబ్ వే వద్ద కాల్పులు జరిపిన నిందితుడి ఫొటోలు, వివరాలు పోలీసులు, అధికారులు విడుదల చేశారు. ఫ్రాంక్ ఆర్ జేమ్స్ (62) న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ సబ్ వే వద్ద మంగళవారం కాల్పులు జరిపాడని ప్రకటించారు. నిందితుడి స్వస్థలం ఫిలడెల్ఫియా అని గుర్తించినట్లు చెప్పారు. ఫ్రాంక్ ఆర్ జేమ్స్ ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపాడని, అందుకోసం ఓ వ్యాన్‌ను కూడా అద్దెకు తీసుకున్నాడు. ఆపై సబ్ వే వద్ద తుపాకీతో ఒక్కసారిగా కాల్పులు జరిపి భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశాడని అధికారులు తెలిపారు. నిందితుడు జేమ్స్ ఫొటోలను విడుదల చేసిన అనంతరం అతడి ఆచూకీ తెలపాలని ఎన్‌వైపీడీ చీఫ్ డిటెక్టివ్ జేమ్స్ ఇస్సిగ్ ప్రజలను కోరారు.






స్థానిక మీడియా ప్రకారం 36వ స్ట్రీట్ స్టేషన్ వద్ద కాల్పుల మోతతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. కాల్పులు జరిపిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గ్యాస్ మాస్క్ ధరించిన ఓ ముసుగు వ్యక్తి న్యూయార్క్ లోని బ్రూక్లిన్ సబ్ వే వద్ద ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. బాంబులు, కొన్ని పేలుడు పదార్థాలు సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


గ్యాస్ బాంబు ప్రయోగించి.. అనంతరం తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి భారీ ప్రాణ నష్టానికి కారకుడిగా మారాడు. కాల్పులు జరిపిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు వివరించారు. నిందితుడి బ్యాగులో కొన్ని గ్యాస్ బాంబులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.






Also Read: Visakha News : విశాఖ కోర్టు సంచలన తీర్పు, పోక్సో కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష


See Photos: Brooklyn Shooting Photos: అమెరికాలో కాల్పుల కలకలం - బ్రూక్లిన్ సబ్‌వే స్టేషన్‌లో కాల్పుల మోత