Brooklyn Shooting Photos: అమెరికాలో కాల్పుల కలకలం - బ్రూక్లిన్ సబ్వే స్టేషన్లో కాల్పుల మోత
అమెరికాలో మళ్లీ బాంబులు, తూపాకీల మోత మోగింది. న్యూయార్క్ బ్రూక్లిన్ సబ్వే స్టేషన్ Brooklyn Subway Station) వద్ద పేలుడు, కాల్పులు జరిగాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబ్రూక్లిన్ సబ్వే వద్ద జరిగిన కాల్పుల్లో 13 మంది వరకు గాయపడినట్లు న్యూయార్క్ అధికారులు తెలిపారు.
బ్రూక్లిన్ సబ్వే స్టేషన్లో అకస్మాత్తుగా కాల్పుల శబ్దం వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. శబ్దం రాగానే జనాలు భయంతో పరుగులు పెట్టారు.
అమెరికా సెక్యూరిటీ ఏజెన్సీలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆ ప్రాంతంలో పలు పేలుడు పదార్థాలు కూడా లభ్యమయ్యాయి.
ఓ అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పారిపోగా.. పట్టుకునేందుకు మెట్రోస్టేషన్లు మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో గాయపడ్డ ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారనేదానిపై ఇంకా స్పష్టత లేదు.
న్యూయార్క్ నగరానికి చెందిన బాంబు తనిఖీ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. పేలుడు ఘటనపై ఎఫ్బీఐ దర్యాప్తు చేపట్టింది. ఎందుకు కాల్పులు జరిగాయనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
స్థానిక మీడియా ప్రకారం 36వ స్ట్రీట్ స్టేషన్ వద్ద కాల్పుల మోతతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. కాల్పులు జరిపిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
గ్యాస్ మాస్క్ ధరించిన ఓ ముసుగు వ్యక్తి న్యూయార్క్ లోని బ్రూక్లిన్ సబ్ వే వద్ద ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. కొన్ని పేలుడు పదార్థాలు సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
న్యూయార్క్లో జనవరిలో ఓ అపరిచిత వ్యక్తి మహిళను రైలు కిందకు తోసి హత్య చేశాడు. ఆ తరువాత జరిగిన పెద్ద ఘటనగా ఈ కాల్పుల ఘటనగా అధికారులు చెబుతున్నారు.
న్యూయార్క్, బ్రూక్లిన్ లోని సబ్ వే వద్ద జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.