Jeff Bezos Advice to Americans:


డబ్బు దాచుకోండి : బెజోస్


అమెజాన్ మాజీ సీఈవో జెఫ్ బెజోస్ అమెరికన్లకు ఉచిత సలహాలు ఇచ్చి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం అగ్రరాజ్యంలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. కొవిడ్ తరవాత కోలుకుంటుంది అనుకున్నా...ఆర్థిక వ్యవస్థ పతనమవుతూనే ఉంది. బడా సంస్థలన్నీ లేఆఫ్‌లు మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే...జెఫ్ బెజోస్ CNN Businessకి ఇచ్చిన  ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. "అమెరికన్లంతా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖర్చులు తగ్గించుకోవాలి. పెద్ద పెద్ద ఇళ్లు, కార్లు కొనొద్దు" అని సలహా ఇచ్చాడు. వచ్చే ఏడాది నాటికి పరిస్థితులు మరీ దిగజారొచ్చని, అప్పటికి సర్వైవ్ అవ్వాలంటే పెద్ద ఖర్చులు తగ్గించుకోవాలని సూచించాడు. "కొంత పొదుపు చేసుకున్నా చాలు. అది ఎంతో మార్పు తీసుకొస్తుంది" అని అన్నాడు. "మీరు ఓ పెద్ద టీవీని కొనాలని అనుకుంటుండొచ్చు. కానీ...ఆ పని మానుకోండి. ఆ డబ్బుని దాచుకోండి. ఆ తరవాత ఏం జరుగుతుందో గమనించండి" అని చెప్పాడు. ఆయన ఏ ఉద్దేశంతో ఈ మాటలు చెప్పినా...అవైతే మిస్‌ఫైర్ అయ్యాయి. అప్పటి నుంచి బెజోస్‌పై విమర్శలు మొదలయ్యాయి. పెద్ద కార్లు కొనొద్దని బెజోస్ ఇచ్చిన సలహాపై ఆటో ఇండస్ట్రీ మండిపడుతోంది. "కొవిడ్ ప్రభావంతో ఇప్పటికే మూడేళ్లుగా అమ్మకాలు లేవు. సప్లై చెయిన్‌లో సమస్యలు ఎదురవుతున్నాయి" అని అసహనం వ్యక్తం చేసింది. పెద్ద కార్లు, టీవీలు కొనొద్దు అని సలహా ఇచ్చిన బెజోస్‌పై టెక్ జర్నలిస్ట్‌లు కూడా విమర్శలు ఎక్కు పెడుతున్నారు. "పెద్ద కార్లు, టీవీలు కొనొద్దని జెఫ్ బెజోస్ చెబుతున్నారు. దీనర్థం ఏంటంటే...ఆ డబ్బులన్నీ పొదుపు చేసుకుని అమెజాన్‌లో వస్తువులు కొనుగోలు చేయాలని" అని కౌంటర్‌లు వేస్తున్నారు. 










అమెజాన్‌లో లేఆఫ్‌లు..


మొత్తం 10 వేల మందిని తొలగించాలని అమెజాన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. భారత్‌లో ఎంత మందిని తొలగిస్తారని కచ్చితంగా సంఖ్య తెలియకపోయినా...భారీగానే ఉంటాయని అంటున్నారు. మెటా కంపెనీ కన్నా ఎక్కువ మంది ఉద్యోగులకు ఉద్వాసన ఇచ్చేందుకు ప్లాన్ రెడీ చేసుకుంటోందట అమెజాన్. భారత్‌లో అమెజాన్‌కు లక్షా 10 వేల మంది ఉద్యోగులున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మంద గమనంగా సాగుతున్నందున బిజినెస్ పెద్దగా జరగడం లేదు. అందుకే...కాస్ట్ కటింగ్‌లో భాగంగా ఈ లేఆఫ్‌లు చేపట్టాలని అనుకుంటోంది అమెజాన్ కంపెనీ. 


Also Read: Dhruva Space: అంతరిక్ష రంగంలో "ధ్రువ స్పేస్" సంచలనం, దూసుకుపోతున్న హైదరాబాద్ కంపెనీ