Ex-Pakistan President Parvez Musharraf s land in UP : పాకిస్తాన్ మాజీ మిలటరీ పాలకుడు పర్వేజ్ ముషారఫ్‌కు ఇండియాలో ఆస్తులు ఉన్నాయి. వాటిలో ఉన్న ఒక ఆస్తిని ప్రభుత్వం వేలం వేసేసింది. యూపీలోని కొటానా అనే గ్రామంలో ఉన్న రెండు హెక్టార్ల భూమిని రూ. కోటి ముఫ్పై ఎనిమిది లక్షలకు వేలం పాటలో ఇతర వ్యక్తులు దక్కించుకున్నారు. రిజిస్ట్రేషన్ తో కలిపి కోటిన్నర అవుతుంది.
దేశ విభజన సమయంలో పాకిస్థాన్ వెళ్లిపోయిన ముషారఫ్ కుటుంబం
పాకిస్తాన్ మిలటరీ చీఫ్ గా కూడా పని చేసిన ముషారఫ్.. అసలు భారత్ లో ఎందుకు ఆస్తులు కొన్నాడన్న డౌట్ చాలా మందికి వస్తుంది. నిజానికి ముషారఫ్ పుట్టింది ఇండియాలోనే . దేశ విభజనకు ముందు ఆయన ఇండియాలో పుట్టారు. ఆయన కుటుంబానికి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి. అయితే విభజన సమయంలో ముషారఫ్ కుటుంబం పాకిస్థాన్ వెళ్లిపోయింది. దాంతో ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ అలాగే ఉండిపోయాయి. సాధారణంగా ఇలాంటి ఆస్తుల్ని ఎనిమీ ప్రాపర్టీగా ప్రకటించి కేంద్రం స్వాధీనం చేసుకుంటుంది. ఇప్పటి వరకూ ఆ ఆస్తుల్ని కాపాడిన కేంద్రం మెల్లగా అమ్మేస్తూ వస్తోంది.
సంజయ్‌రాయ్‌కు బెయిల్ ఇచ్చేయమంటారా ? - సీబీఐ ఆలసత్వంపై బెంగాల్ కోర్టు ఆగ్రహం
వారి ఆస్తుల్ని ఎనిమీ ప్రాపర్టీస్ గా ప్రకటించిన కేంద్రం
ఇదొక్కటే కాదు.. ఎనిమీ ప్రాపర్టీస్ కింద చాలా ఆస్తులను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ విభాగం పర్యవేక్షిస్తూ వస్తోది. ముషారఫ్ తాత కొటానాలో నివసించారు. ముషారఫ్ తండ్రి సయ్యద్ ముషారఫుద్దీన్, తల్లి జరీన్ బేగం ఢిల్లీలోనే నివరసించారు. కానీ ముషారఫ్ తాత స్వగ్రామం మాత్రం కొటానా. అందరూ పాకిస్థాన్ వెళ్లిపోయాక ఆ ఆస్తుల్ని ఎవరూ క్లెయిమ్ చేసుకోలేదు. 2010లో ఎనిమీ ప్రాపర్టీగా కేంద్రం ప్రకటించింది. వేలం వేసిన ఆస్తి.. వ్యవసాయానికి కూడా అంత అనుకూలంగా లేనట్లుగా తెలుస్తోంది.
బంగ్లాదేశ్ రాజకీయాల్లో సంచలనం, షేక్ హసీనాతో పాటు మరో ఆరుగురిపై హత్య కేసు
గత ఏడాది చనిపోయిన ముషారఫ్
1999లో పాకిస్తాన్ లోని ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి ముషారఫ్ మిలటరీ పాలకుడు అయ్యారు. 2001 నుంచి 2008 వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత పదవి నుంచి వైదొలగాల్సి రావడంతో ఆయన పాకిస్తాన నుంచి పారిపోయారు. అనారోగ్యం కారణంగా దుబాయ్ లో చనిపోయారు. ఢిల్లీలో కొన్ని వందల కోట్లు విలువ చేసే ఎనిమీ ప్రాపర్టీలు ఉన్నాయని అధికార వర్గాలుచెబుతున్నాయి. వాిని కూడా మెల్లగా వేలం వేసే అవకాశాలు ఉన్నాయి.