Kolkata Court Raps CBI Over Lawyer s Absence In RG Kar Rape-Murder Case : కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ బెయిల్ పై విచారణ సందర్భంగా కోల్ కతా కోర్టు సీబీఐ తరఫు న్యాయవాది రాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడికి బెయిల్ ఇవ్వమంటారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తర్వాత దాదాపు గంట ఆలస్యంగా సీబీఐ లాయర్ వచ్చారు. ఇంత అలసత్వం ఎందుకని. బెయిల్ ఇచ్చేయమంటారా అని న్యాయమూర్తి అని ప్రశ్నించారు. అయితే సంజయ్ ను విడుదల చేస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని.. బెయిల్ ఇవ్వొద్దని కోరారు.
కోల్‌కతా డాక్టర్‌ది గ్యాంగ్ రేప్ కాదు - సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చిన సీబీఐ ?
కోల్ కతా డాక్టర్ అత్యాచారం, హత్య కేసును ప్రస్తుతం సీబీఐ విచారణ జరుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతున్నప్పుడే నిందితుడు సంజయ్ రాయ్ ను అరె్స్ట్ చేశారు. కానీ దర్యాప్తులో అనేక లోపాలున్నాయని విమర్శలు వచ్చాయి. చివరికి కోర్టు ఆదేశించంతో సీబీఐ హ్యాండోవర్ చేసుకుంది. అయితే ఎలాంటి ముందడుగు పడలేదు. చివరికి నిందితుడిగా పాలిగ్రాఫ్ టెస్టు కూడా చేశారు. ఆయన తాను హత్య మాత్రమే చేశానని అత్యాచారం చేయలేదని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. మరో వైపు డాక్టర్ పై సామూహిక అత్యాచారం జరిగిందన్న ప్రచారాన్ని సీబీఐ కూడా తోసిపుచ్చింది. అలాంటిదేమీ లేదని దర్యాప్తులో తేలినట్లుగా చెబుతున్నారు.
మరో వైపు ఈ కేసులో ఆర్జీకర్ ఆస్పత్రి , మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ను అరెస్టు చేశారు. ఆయనకు ఈ హత్యతో సంబంధాలు ఉన్నాయో లేవో కానీ.. ఆస్పత్రి, మెడికల్ కాలేజీలో జరిగిన అనేక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. అందుకే ప్రిన్సిపల్ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. త్వరలో ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేయనున్నారు. అయితే సంజయ్ రాయ్ కోసం వాదించేందుకు లాయర్లు ముందుకు రావడంతో ఆయన బెయిల్ కోసం న్యాయం పోరాటం చేస్తున్నారు.
మాకు డబ్బులొద్దు , న్యాయం కావాలి - కోల్‌కతా డాక్టర్ తల్లి భావోద్వేగ లేఖ !
అసలు కన్నా ఈ కేసులో రాజకీయం ఎక్కువ అయింది. దీంతో పెద్ద రాజకీయ దుమారం రేగుతోంది. బీజేపీ, తృణమూల్ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుటున్నారు. మొదట మమతా బెనర్జీని బీజేపీ ఇరుకున పెట్టింది.. కేసు సీబీఐకి వెళ్లిన తర్వాత ఆ అడ్వాంటేజ్ మమతా బెనర్జీ తీసుకన్నారు. ఇప్పటికీ నిందితుడికి శిక్ష పడాలని పెద్ద ఎత్తునకోల్ కతాలో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి.