Kolkata rape victim  mother  emotional letter :  కోల్ కతా వైద్యురాలి హత్య కేసులో కీలక పరిణామాలు  చోటు చేసుకుంటున్నాయి. సీబీఐ విచారణ తర్వాత పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మరో వైపు  వైద్యురాలి కుటుంబసభ్యులు ఇతరులు తమకు ఆర్థిక సాయం చేయాలని ప్రయత్నిస్తూండటంపై ఆవేదనకు గురవుతున్నారు. తమకు డబ్బులు వద్దే వద్దని .. తమ బిడ్డకు న్యాయం జరగాలని హత్యాచారానికి గురైన వైద్యురాలి తల్లి బావోద్వేగ లేఖను టీచర్స్ డే సందర్భంగా  విడుదల చేశారు. తమ కుమార్తె అప్పుడూ .. తనకు డబ్బులు అవసరం లేదని చెబుతూ ఉండేదని ఆ లేఖలో గుర్తు చేసుకున్నారు. 


డబ్బులు వద్దు న్యాయం కావాలంటున్న హతురాలి తల్లి            


లేఖలో పలు అంశాలను బాధితురాలి తల్లి గుర్తు చేసుకున్నారు. తాను తిలోత్తమ అమ్మను అని.. టీచర్స్ డే రోజున అందరు టీచర్లకు తాను సెల్యూట్ చేస్తున్నానన్నారు. చిన్నప్పటి నుండి తన కుమార్తె డాక్టర్ కావాలని కలలు కన్నదని గుర్తు చేసుకున్నారు. ఆమె తన కలను నెరవేర్చుకునే విషయంలో టీచర్లు అందరూ సహకరించారన్నారు. వారే రక్షణగా నిలబడ్డారన్నారు. మీలాంటి మంచి టీచర్ల వల్లనే ఆమె డాక్టర్ అయ్యారని ..తనకు డబ్బులు అవసరం లేదని.. తను మరింత ఉన్నత చదువులు చదువుకుని మరింత మంది రోగులకు వైద్యం చేయాలని అనుకుంటున్నానని చెబుతూ ఉండేదన్నారు. 


కోల్‌కతా డాక్టర్ కేసు సీబీఐ చేతికి వెళ్లడమే అడ్వాంటేజ్ - బీజేపీని ఇరుకున పెడుతున్న మమతా బెనర్జీ


సాక్ష్యాలు ఉంటే వెంటనే తెలియచేయాలని ఆర్జీకర్ ఆస్పత్రి సిబ్బందికి వినతి 


ఓ తల్లిగా మెడికల్ కాలేజీ టీచర్లు, డాక్టర్లు, వైద్య అధికారులు, నర్సింగ్ సిబ్బందికి చేతులు జోడించి ఓ విజ్ఞప్తి చేస్తున్నాన్నారు. హత్యాచార ఘటనకు సంబంధించి ఎలాంటి సాక్ష్యం లేదా సమాచారం ఉన్నా ఇవ్వాలన్నారు. ఎందుకంటే.. అన్నీ తెలిసి సైలెంట్ గా ఉన్నా క్రిమినల్స్ ను ఎంకరేజ్ చేసినట్లే అవుతుందన్నారు.  హత్య గటన జరిగిన తర్వాత పోస్టు మార్టం నిర్వహించక ముందే కోల్ కతా పోలీసులు తమకు డబ్బులు ఇవ్వజూపారని ఇటీవలే ఆ కుటుంబసభ్యులు బయట పెట్టారు. ఆ తర్వతా కూడా పలువురు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం కూడా అదే చెప్పింది.  కానీ తమకు డబ్బులు వద్దే వద్దని ఆ కుటుంబం చెబుతోంది 


రోడ్ సైడ్ చాయ్ వాలా - స్టైలింగ్‌తోనే సూపర్ స్టార్ అయ్యాడు - ఇప్పుడెంత సంపాదిస్తాడో తెలుసా ?


వైద్యురాలి తల్లి లేఖ వైరల్ 


వైద్యురాలి తల్లి రాసిన లేఖ వైరల్ అయింది. కోల్ కతా లోని ఆర్జీకర్ ఆస్పత్రిలో  రాత్రి పూట జరిగిన డాక్టర్ హత్యాయార ఘటన దేశవ్యాప్తంగా కలకలంరేపింది. ఓ నిందితుడ్ని పట్టుకున్నప్పటికీ.. పూర్తి సమాచారం తెలియడం లేదు. గ్యాంగ్ రేప్ జరగలేదని తాజాగా తేల్చారు. నిందిడుకి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహిస్తే.. తాను హత్య మాత్రమే చేశానని అత్యాచారం చేయలేదని అంటున్నారు. ఈ మిస్టరీ మొత్తం వీడేలా చేయాడానికి సీబీఐ అధికారులు విస్తృతంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు.