Interest Rate Of EPF Account: పిఎఫ్ చందాదారులకు ( PF ) ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) షాకినిచ్చింది. ప్రావిడెంట్ ఫండ్ నిల్వపై వడ్డీ రేటు 8.10 శాతంగా నిర్ణయించింది. అది ఇటీవలి కాలంలో అత్యంత తక్కువ వడ్డీ రేటు. 40 ఏళ్ల నుంచి కనీసం 8.5 శాతం వడ్డీ ఉంటూ వస్తోంది. ఇప్పుడు అతి తక్కువ శాతానికి తగ్గించారు. ఈ మేరకు శనివారం ఈపిఎఫ్‌ఒ నిర్ణయ మండలి కేంద్ర ధర్మకర్తల బోర్డు ( CBT ) సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. 8.1శాతం వడ్డీరేటు నిర్ణయాన్ని సిబిటి కేంద్ర ఆర్థికశాఖకు పంపనుంది.
గుడ్‌న్యూస్ రాబోతోందా! ఉద్యోగుల కోసం EPFO సరికొత్త పింఛను పథకం!
ఆర్థికశాఖ నుంచి ఆమోదం పొందిన తర్వాత చందాదారులకు 8.1 శాతం మాత్రమే వడ్డీ జమ చేస్తారు. ఈపిఎఫ్‌పై ఇంత తక్కువ వడ్డీ రేటు ఇవ్వడం 1977-78 తర్వాత ఇదే తొలిసారని కార్మిక వర్గాలుచెబుతున్నాయి. 1977-78 లో పీఎఫ్‌పై 8శాతం ఉండేది. 2013-14, 2014-15లో 8.75శాతం చొప్పున ఇచ్చారు. 2015-16లో 8.8శాతం చొప్పున జమచేశారు. అయితే కోవిడ్ దృష్ట్యా పిఎఫ్‌లో ఉన్న నగదును చందాదారులు విత్‌డ్రా చేయడం, జమయ్యే సొమ్ము తగ్గిపోవడంతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీని ఏడేళ్ల కనిష్ఠానికి తగ్గించి 8.5శాతంగా ఇచ్చారు. గత ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే 8.5శాతం వడ్డీని కొనసాగించారు. ఈ ఏడాది 8.1 శాతానికి తగ్గించారు.
[
ఈపీఎఫ్‌వో నుంచి ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు తెలుసా..! వివరాలు ఇవే!
పీఎఫ్ చందాదారులుగా కనీసం ఆరు కోట్ల మంది ఉన్నారు. వీరంతా తమ శాలరీల నుంచి ప్రతీ నెలా పీఎఫ్‌కు జమ చేస్తూ ఉంటారు. వారి తరపున ఉద్యోగ సంస్థలు కూడా కొంత మొత్తం జమ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు వీళ్లందరికి ఈపీఎఫ్‌వో బోర్డు నిర్ణయంతో షాక్ తగిలినట్లయింది. ఈపీఎఫ్‌వో బోర్డు నిర్ణయం వల్ల కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేక వ్యక్తమయ్యే అవకాశం ఉంది. అయితే అంత కన్నా వడ్డీ ఎక్కువ ఇచ్చే పరిస్థితులు లేవని బోర్డుసభ్యులు చెబుతున్నారు. కేంద్రం ఆమోదముద్ర వేయగానే వడ్డీ రేటు అమల్లోకి వస్తుంది.