ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ( YSRCP ) పన్నెండో వార్షికోత్సవం జరుపుకుంటోంది. వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోవడంతో.. అనేక మంది గుండె పగిలి చనిపోయారని..వారందరికీ ఓదార్పు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వలేదని సీఎం జగన్ 2011 మార్చి పన్నెండో తేదీన కొత్త పార్టీని ప్రకటించారు. సుదీర్ఘ కాలం పోరాటం తర్వాత 2019లో పార్టీని జగన్ అధికారంలోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్‌సీపీ 22 మంది ఎంపీలతో లోక్‌సభలో నాలుగో అతి పెద్ద పార్టీగా ఉంది. ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఏపీ శాసనసభలో 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. 


పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఘనంగా జరుపుకుంటున్నారు. మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయని పార్టీ అవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ ( CM Jagan ) పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. 



కోట్లాది మంది ప్రజలు ఆకాంక్షల దిశగా అడుగులు వేసిన వైఎస్ఆర్‌సీపీ అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ( SAJJALA  ) అన్నారు. అధికారం కోసం కొట్లాడే రాజకీయం కాకుండా సేవ చేయడంలో పోటీ చూపిస్తోంది కాబట్టే ఇంత ప్రజాదరణ దక్కుతోందన్నారు. పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 







 






రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లోనూ వైసీపీ పన్నెండో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. వైఎస్ జయంతి రోజున ప్లీనరీని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.  అన్ని చోట్లా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొన్నారు.