Air India Emergency Landing:



ఎయిర్ ఇండియా విమానంలో..


ఈ మధ్య కాలంలో తరచూ విమానాల్లో ఏదో సాంకేతిక లోపం తలెత్తుతూనే ఉంది. ఉన్నట్టుండి పొగలు, మంటలు రావడం అత్యవసరంగా ల్యాండ్ అయిపోవడం లాంటివి తరచూ జరుగుతున్నాయి. మరోసారి ఇలాంటి సంఘటనే జరిగింది. అమెరికా నుంచి ఢిల్లీకి వస్తున్న Air India ఫ్లైట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా...స్టాక్‌హోమ్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో విమానంలో 300 మంది ప్రయాణికులున్నట్టు అధికారులు వెల్లడించారు. అందరూ సేఫ్‌గానే ఉన్నట్టు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ బ్రిగేడ్‌ను పిలిపించింది. ఇంజిన్‌లో ఆయిల లీక్ అయినట్టు పైలట్లు గుర్తించారని అందుకే అత్యవసరంగా ల్యాండింగ్ చేశారని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. రెండో ఇంజిన్‌లోని డ్రెయిన్ నుంచి ఆయిల్ బయటకు రావడాన్ని పైలట్‌లు గుర్తించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. అంతకు ముందు ఎయిర్ ఇండియా ఫ్లైట్‌ కూడా ఇలాగే అత్యవసరంగా ల్యాండ్ అయింది. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఇలా చేయాల్సి వచ్చిందని వివరించారు అధికారులు. ఇవే కాదు. ఈ మధ్య కాలంలో ఎయిర్ ఇండియా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి రెండు, మూడు సార్లు ఫ్లైట్ టైమింగ్స్ మార్చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యే ముంబయిలో ఇదే జరిగింది. రాత్రి 8 గంటలకు బయల్దేరాల్సిన విమానం అర్ధరాత్రి 12.30కి టేకాఫ్ అయింది.