Job And Business Astrology In Telugu:  మీ రాశి,నక్షత్రం ప్రకారం మీరు ఏ రంగంలో ఉద్యోగం చేస్తే, ఎలాంటి వ్యాపారం చేస్తారో, ఏఏ ఉద్యోగాలు మీకు కలిసొస్తాయో ఇక్కడ తెలుసుకోండి


మేషం, వృషభం, మిథునం కర్కాటక రాశివారు వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి


ధనస్సు రాశి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదాలు)


మూల - విద్యా బోధన,న్యాయవాది, జడ్జి, మంత్రి, ప్రభుత్వ రాయబారులు, మత సంస్థలలో ఉన్నత పదవులు, ఆయుర్వేద వైద్యం, మందుల షాపు, డిపార్టుమెంటల్ స్టోర్స్ , పళ్లు-పూల దుకాణాలు వలన జీవనం బావుంటుంది.


పూర్వాషాఢ - న్యాయవాది, బ్యాంకులు, ఆడిట్ సంస్థలు, వెల్ఫేర్ ఆఫీసులు, శిశుసంక్షేమ శాఖలు, ప్రభుత్వ వెటర్నరీ డాక్టరు,  అకౌంటెంట్, రెస్టారెంట్లు, బస్ సర్వీసులు, మార్కెటింగ్ రంగాల్లో బాగా రాణిస్తారు.


ఉత్తరాషాఢ - ఆయుర్వేద వైద్యం, అటార్నీ, బ్యాంకులు, న్యాయవాది, రాయబారి, కస్టమ్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా రాణిస్తారు. 


మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)


ఉత్తరాషాఢ - రియల్ ఎస్టేట్ , స్టీలు మెటీరియల్ సప్లై ఇంజనీరింగ్ విడి భాగాలు, ప్రాచీన వైద్యం, వృద్ధాశ్రమాలు నడపడం, మున్సిపల్ కార్పోరేషన్లో విధులు నిర్వర్తిస్తారు.


శ్రవణం - గ్రానైట్ రాళ్ళు, నూనె మిల్లులు పెట్రోలు బంకులు కూల్ డ్రింకుల తయారీ, ఆనకట్టలు, షిప్ లో పనులతో జీవనోపాధి పొందుతారు.


ధనిష్ట - రక్షణ శాఖలు పెద్ద ఫ్యాక్టరీలు , జూనియర్ ఇంజనీర్ , ప్రభుత్వ విద్యుత్ సంస్థలు, వ్యవసాయం , టీతోటలు, తోలు పరిశ్రమ, మాంస వ్యాపారాలు  ఈ నక్షత్రం వారికి కలిసొస్తాయి


సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశివారు వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


కుంభ రాశి (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


ధనిష్ట - ఇంజనీరింగ్, రైల్వే , గణితం, జ్యోతిష్యం, పరావస్తు శాఖ, లైబ్రరీ, వ్యాయామశాఖ, మెరైన్, రాజకీయం, ఫొటోగ్రఫీ, ఫింగర్ ప్రింట్స్ విభాగాల్లో ఉద్యోగాలు వీరికి బావుంటాయి


శతభిషం -పరిశోధన, హస్త సాముద్రికము, గ్లాస్ వస్తువుల తయారీ, మందులు, రసాయనాలు, ఆసుపత్రులు, జ్యోతిష్యంలో ఈ నక్షత్రం వారు బాగా రాణిస్తారు


పూర్వాభాద్ర - సాముద్రికము, జ్యోతిష్యం, ఫైనాన్స్, బ్యాంకులు, న్యాయవాదులు, మున్సిపాలిటీ, గణాంకశాఖ, పిండిమిల్లులు, ప్రాచీన భాషా గ్రంధాలయాలకు సంబంధించిన శాఖల్లో వృత్తి-వ్యాపారాలు నిర్వహిస్తారు. 


మీన రాశి (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


పూర్వాభాద్ర- రాజకీయాలు, దేవస్థానములు, ట్రావెల్ సంస్థలు, రైస్ హోల్ సేల్, బ్యాంకులు, ప్రొఫెసర్, కౌన్సిలర్, ఉన్నత పదవుల్లో స్థిరపడతారు 


ఉత్తరాభాద్ర -  సిఐడి, రక్షణశాఖలు, రాయబారులు , ప్రభుత్వ వైద్యసంస్థలు, ఇన్సూరెన్స్, మత్స్యశాఖ, దేవాదాయశాఖ,  ఇంజనీర్,  రెస్టారెంట్ , డిపార్టుమెంటు స్టోర్స్, ఎక్స్ పోర్టు ఇంపోర్టు వ్యాపారాలు వీరికి మంచిది


రేవతి  - జడ్జి, శాసనసభ్యత్వం, ప్రభుత్వ రంగములో పెద్ద ఉద్యోగములు, లాయర్లు, రాయబారులు, కస్టమ్స్ ఎక్సైజ్ శాఖ, జర్నలిజం, జ్యోతిష్యం, ఆడిట్, యాడ్స్, షేర్ మార్కెట్ , బ్యాంకులు , చిట్ ఫండ్స్ , కొరియర్ , ప్రింటింగ్ వృత్తుల్లో రాణిస్తారు.


NOTE: ఈ వృత్తులు అన్నింటిలోనూ స్థాయి బేధం ఉంటుంది..అత్యున్నత స్థాయి, ఉన్నతస్థాయి, మధ్యమస్థాయి, అధమస్థాయి, అధమాధమ స్థాయి ఉంటాయి. జాతకుడు ఎలాంటి స్థానంలో ఉంటాడనేది లగ్నాధిపతి ఆధారంగా ఉంటుంది.