Job And Business Astrology:  మీ రాశి,నక్షత్రం ప్రకారం మీరు ఏ రంగంలో ఉద్యోగం చేస్తే, ఎలాంటి వ్యాపారం చేస్తారో, ఏఏ ఉద్యోగాలు మీకు కలిసొస్తాయో ఇక్కడ తెలుసుకోండి


మేష రాశి (అశ్వని, భరణి, కృత్తిక 1 పాదం)
మేషరాశి వారిలో మీ నక్షత్రం అశ్విని అయితే.. ఫ్యాక్టరీ, పోలీసు, మిలటరీ, వైద్యరంగం, రైల్వే, పోస్టల్ శాఖలలో ఉద్యోగాలు మీకు కలిసొస్తాయి. మీకు మీరు స్వతంత్రంగా ఉండాలనుకుంటే ప్రైవేటు వైద్యం, ఇనుము, మందుల షాపు, కొరియర్, కలప వ్యాపారాలు చేయడం మంచిది


భరణి నక్షత్రం జాతకులు సంగీతం, బట్టల మిల్లులు, భవననిర్మాణం, వాహనాలు నడపటంలో ఉద్యోగాలు చేయడం మంచిది.  సొంతంగా పరిశ్రమ స్థాపించటం, థియేటర్ల నిర్వహణ, హోటల్, పశువైద్యం, గృహోపయోగ సామాగ్రి, పాలు, రసాయనాలు, రత్నాల వ్యాపారం కలిసొస్తుంది


కృత్తిక నక్షత్రం వారు  రక్షణశాఖలు, రసాయన కర్మాగారాలు, అగ్ని సంబంధ కర్మాగారాల్లో ఉద్యోగం పొందుతారు. సొంతంగా అయితే టింబర్ డిపో, ఆయుధ తయారీ, భవన నిర్మాణ సామాగ్రి సరఫరా, ఎలక్ట్రికల్ షాపు నిర్వహణ కలిసొస్తాయి.


Also Read: ఈ వారం ఈ రాశులవారిపై లక్ష్మీదేవి కృప ఉంటుంది, ఫిబ్రవరి 6 నుంచి 12 వారఫలాలు


వృషభ రాశి  (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
వృషభరాశికి చెందిన కృత్తిక నక్షత్ర జాతకులు నగల షాపు, ఫోటోగ్రఫీ, రెడీమేడ్ దుస్తులు, సాంస్కృతిక కార్యక్రమములు నిర్వహించుట. మెడికల్ షాపు నిర్వహణ లాంటివి బాగా కలిసొస్తాయి


మీది రోహిణి  నక్షత్రం అయితే హోటల్, బేకరీ, లాడ్జి, బట్టలు, ఉన్ని - నూలు, రవాణా, పార్లర్, నూనె ఫ్యాక్టరీల వ్యాపారం అయినా ఇందులో ఉద్యోగం అయినా కలిసొస్తుంది


మృగశిర నక్షత్రం వారు అయితే  ఎస్టేట్లు, పురుగుల మందుల దుకాణములు, కర్మాగారాలు, లాండ్రీలు, పొగాకు సంస్థలు, వ్యవసాయం, సినిమా ధియేటర్, ఆటోమొబైల్, ఇంజనీరింగ్, బ్రాందీ షాపులు, పండ్లు పూల దుకాణాలు,  తోలు వస్తువులు తయారుచేసే ఫ్యాక్టరీల్లో ఉద్యోగం, వ్యాపారం బావుంటుంది


మిధున రాశి (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
మీది మృగశిర నక్షత్రం అయితే స్పేర్ పార్టులు, ఎలక్ట్రికల్ వస్తువులు, మందుల తయారీ, బేకరీ, టెలిఫోన్, వైర్లెస్ సమాన్లు తయారు చేసే వృత్తి వ్యాపారాలు ఎక్కువగా చేస్తారు


ఆరుద్ర నక్షత్ర జాతకులు అయితే... యాడ్ బిజినెస్, మెడికల్ షాపు, ఫైనాన్స్, టి.వి. రేడియో షాపులు, పోస్టల్ & టెలిగ్రాఫ్, పురుగుమందులు, న్యూస్ పేపరు ఏజెన్సీలో పనిచేస్తారు.


పునర్వసు నక్షత్రానికి చెందినవారు జ్యోతిష్యం, రచనా వ్యాసంగం, పత్రికా నిర్వహణ, ఇంజనీరింగ్, కమీషన్ రంగం, విద్యాబోధన, ఇన్సూరెన్స్, పోస్టల్ శాఖ, రాయబార కార్యాలయాలు, రాజకీయాల్లో వెలుగుతారు. 


Also Read: ఈ రాశులవారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు, లాభ-నష్టాలు సమానంగా ఉంటాయి




కర్కాటక రాశి  (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)



కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్ర జాతకులు ఫైనాన్స్, దేవాలయం, మత సంబంధ వృత్తులు వైద్యం, నీటి పారుదల శాఖ, బ్యాంకులు షిప్పింగ్ ఏజెన్సీలలో ఉద్యోగ వ్యాపారాలు చేస్తారు.


పుష్యమి నక్షత్రానికి చెందిన వారు కార్పోరేషన్ , ఇంజనీర్, పెట్రోలు బంక్,  బ్లడ్ బ్యాంకు, ఉన్ని షాపులు , త్రవ్వకపు సంస్థల్లో ఉద్యోగ, వ్యాపారాలు చేస్తారు


ఆశ్లేష నక్షత్ర జాతకులు అయితే ప్రింటింగ్ ప్రెస్ , కళారంగం, లాటరీషాపులు, సినిమా ధియేటర్లు , బట్టల మిల్లులు, ట్రావెల్ ఏజెన్సీ నిర్వహణ ఎక్కువగా కలిసొస్తాయి


https://telugu.abplive.com/web-stories/chanakya-niti-in-telugu-chanakya-says-these-things-spoil-the-relationship-between-husband-and-wife-57836