2018, ఫిబ్రవరి 6న ‘స్పేస్‌‌ఎక్స్’ కంపెనీ ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా ‘టెస్లా రోడ్ స్టార్’ కారును అంతరిక్షంలో ప్రవేశపెట్టిన సంగతి మీకు గుర్తుందా? అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఒక కారును అంతరిక్షంలో వదలడం అదే మొదటిసారి. పైగా ఆ అరుదైన ఘటనను లైవ్‌లో కూడా టెలికాస్ట్ చేశారు. ఆ కారు అంతరిక్షంలో ఎలా తిరుగుతుందో చూడండి అంటూ.. యూట్యూబ్ లైవ్ కూడా ఇచ్చారు. అయితే, ఇప్పుడు ఆ లైవ్ అందుబాటులో లేదు. ప్రస్తుతం.. రికార్డు చేసిన వీడియో మాత్రమే యూట్యూబ్‌లో ఉంది. మరి, ఇప్పుడు టెస్లా కారు ఎక్కడ ఉంది? అది మళ్లీ భూమికి తిరిగి వచ్చే అవకాశాలున్నాయా? దాని వల్ల ఏమైనా ప్రమాదం ఉందా అనే సందేహాలపై ఇటీవల పలువురు పరిశోధకులు తమ అభిప్రాయాన్ని తెలిపారు. 


ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా కారును ప్రమోట్ చేయడానికి పరిశోధకులు పెద్ద ప్రయత్నమే చేశారు. ఆ కారును భూమి కక్ష్యలో కాకుండా అంగారక కక్ష్యలో వదిలిపెట్టారు. అయితే, అది ఆ కక్ష్య నుంచి దారి మళ్లి.. భూమి వైపు దూసుకొస్తున్నట్లు ఒకప్పుడు వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పట్లో అది భూమి వైపు వచ్చే అవకాశాలు లేవని, 2091 సంవత్సరానికి అది భూమి కక్షలోకి చేరే అవకాశాలున్నాయని అంచనా వేశారు. ఒక వేళ అది భూమి వైపు దూసుకొచ్చినా.. పెద్ద నష్టం ఉండబోదని ఆర్బిటల్ డైనమిక్స్‌పై అధ్యయనకర్తలు హన్నో రైన్, డానియేల్ టమాయో, డేవిడ్ వక్రౌల్కీలు రాయల్ ఆస్ట్రానామికల్ సొసైటీ మ్యాగజైన్‌లో వెల్లడించారు.


Also Read: ‘ఆత్మహత్య’కు అనుమతి.. నొప్పిలేకుండా చంపే యంత్రానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!


ఆ కారు ఇప్పుడు ఎక్కడ ఉంది?: అంతరిక్షంలో చక్కర్లు కొడుతున్న టెస్లా కారు గురించి అంతా మరిచిపోతున్న క్షణాల్లో.. ఆ సంస్థ యజమాని ఎలన్ మస్క్ మరోసారి గుర్తుచేశారు. ‘‘నా కారు ప్రస్తుతం అంగారక గ్రహం వద్ద చక్కర్లు కొడుతోంది’’ అని ట్వీట్ చేశారు. దీంతో మరోసారి టెస్లా రోడ్ స్టార్ గురించి చర్చ మొదలైంది. అయితే.. హార్వర్డ్ - స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోపిజిక్స్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త జొనాథన్ డువెల్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఎలన్ మస్క్ చెప్పిన అంశాన్ని ఆయన్ని విశ్లేషించారు. తన అంచనా ప్రకారం.. ఆ కారు పూర్తిగా అంగారక గ్రహం కక్ష్యలో లేదని.. తెలిపారు. ప్రస్తుతం అది సూర్యుడి కక్ష్యలోనే తిరుగుతోందని వెల్లడించారు. మస్క్ ట్వీట్‌పై సందేహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా NASAకు చెందిన జెట్ ప్రొప్యుల్షన్  ఆ కారు ఏ కక్ష్యలో ఉందనేది చిత్రాలతో సహా వివరించారు. ఆ కారు అంగారక గ్రహం, సూర్యుడికి మధ్య ఉండే కక్ష్యలో ఇరుక్కున్నట్లు అంచనా వేశారు. ఒక వేళ ఇది అంగారకుడికి చుట్టూ పరిభ్రమించాలంటే.. ఒక కక్ష్యకు సుమారు 557 రోజులు పడుతుందట. ఇది భూమి చుట్టూ తిరిగే కక్ష్య కంటే పెద్దదట. 


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: ఇదో వింత గ్రామం.. మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..


Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క


Also Read: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లల విషయంలోనూ..


Also Read: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్


Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి