తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బొమ్మూరు జి.పి.ఆర్ గ్రౌండ్ లో గోదారోళ్ల కితకితలు ఫేస్ బుక్ గ్రూపు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన గోదావరి జిల్లాల వాసులు హాజరై సందడి చేశారు. గోదావరి జిల్లాల వాసులకి సొంతమైన ప్రత్యేకమైన యాస, సంప్రదాయాలని గుర్తు చేసుకుంటూ నిర్వాహకులతో పాటు  కార్యక్రమానికి హాజరైన గ్రూప్ సభ్యులు నవ్వులు పూయించి కితకితలు పెట్టారు. ఆత్మీయ కలయిక సందర్భంగా నిర్వాహకులు గోదావరి జిల్లాలకు సంబంధించి దాదాపు 40 రకాల సంప్రదాయ శాకాహార వంటలను తయారుచేయించి వడ్డించారు. కార్యక్రమం ఆద్యంతం పిల్లాపాపలతో ఆటపాటలతో ఉత్సాహంగా సాగగా రేడియో జాకీ శ్రీను మామ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యానం చేశారు. 


Also Read: రేపటి నుంచి ఉద్యమకార్యాచరణకు సిద్ధం... నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని ఉద్యోగ సంఘాల నిర్ణయం


గోదారోళ్ల కితకితలు గ్రూప్ అడ్మిన్ ఈవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ గోదావరి జిల్లాల యాస, సంస్కృతి, సంప్రదాయాలు నేటి తరానికి తెలియజేయాలన్న ఆకాంక్షతోనే గోదారోళ్ల కితకితలు ఫేస్బుక్ గ్రూపులు ఏర్పాటు చేశామన్నారు. రెండు లక్షలకు  పైబడి సభ్యులు ఈ గ్రూప్ ల్లో ఉన్నారని వెల్లడించారు. మాటల్లో వెటకారం మనసు నిండా మమకారం గోదారోళ్లకు అలంకారం అంటున్నారు నిర్వాహకులు. ఈ ప్రాంత వాసులు నలుగురు ఒకచోట చేరితే అక్కడ నవ్వుల పూయిస్తాయి. అలాంటిది వేల మంది ఒకేచోట చేరితే సంతోషాల సునామీ. తమదైన యాస, సంప్రదాయాల్ని కాపాడుకునేందుకు ఏర్పాటైన గోదారోళ్ల కితకితలు ఫేస్‌బుక్‌ గ్రూప్‌ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. 


Also Read:  ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ... ఉద్యోగులు తలచుకుంచే ప్రభుత్వాన్ని కూల్చవచ్చు... వైరల్ అవుతున్న ఏపీఎన్జీవో అధ్యక్షుడి వీడియో


రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 5వేల మంది సభ్యులు హాజరయ్యారు. గ్రూప్‌ అడ్మిన్‌ ఈవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ గోదావరి జిల్లాల యాస, సంస్కృతి, సంప్రదాయాలు నేటితరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఫేస్ బుక్ గ్రూప్‌ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 2 లక్షల మంది సభ్యులు ఉన్నారన్నారు.  ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా విందు ఏర్పాటు చేశారు. దాదాపు 40 రకాల వంటకాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. రేడియో జాకీ శ్రీను మామ వ్యాఖ్యానంతో చిన్న చిన్న పొడుపు కథలు, ఆటపాటలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.


Also Read: చెప్పిన పని చేయకపోతే చీరేస్తా... మహిళా ఎంపీడీవోకు స్థానిక నేత బెదిరింపులు... వైరల్ అవుతున్న వీడియో


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి