ABP  WhatsApp

Durga Puja Pandal Fire: దుర్గామాత మండపంలో అగ్ని ప్రమాదం- ఐదుగురు మృతి, 64 మందికి గాయాలు!

ABP Desam Updated at: 03 Oct 2022 12:44 PM (IST)
Edited By: Murali Krishna

Durga Puja Pandal Fire: ఉత్తర్‌ప్రదేశ్‌లో దుర్గామాత మండపంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు.

(Image Source: PTI)

NEXT PREV

Durga Puja Pandal Fire: ఉత్తర్‌ప్రదేశ్‌లో దుర్గామాత మండపం వద్ద ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. భదోహిలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో 64 మంది గాయపడ్డారు.


ఇదీ జరిగింది


భదోహిలో దుర్గాపూజ మండపంలో ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదాం జరిగింది. ఈ ఘటనలో కనీసం 5 మంది మరణించారు. మరో 64 మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సంఘటన సమయంలో దాదాపు 150 మంది మండపంలో ఉన్నట్లు పేర్కొన్నారు. 



దుర్గా పూజ హారతి సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో దాదాపు 150 మంది మండపంలో ఉన్నారు. 52 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ట్రామా సెంటర్లలో చేరిన బాధితులకు 30-40% కాలిన గాయాలున్నాయి. అయితే అందరి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నాం.                                                              -   గౌరంగ్ రాఠీ, భదోహి డీఎం 


Also Read: Congress Presidential Poll: 'పోటీ వద్దని చెప్పినా థరూర్ వినలేదు- చర్చకు నేను ఒప్పుకోను'


Also Read: Bharat Jodo Yatra: మనల్ని ఏ శక్తీ అడ్డుకోలేదు, ప్రజల గొంతుక వినిపించి తీరదాం - కర్ణాటకలో రాహుల్ గాంధీ

Published at: 03 Oct 2022 11:53 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.