ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ఛైర్మన్‌గా ఎస్​ సోమ్​నాథ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.​ ఈ మేరకు ఇస్రో ప్రకటించింది. ఈ బాధ్యతలు చేపట్టకముందు విక్రమ్​ సారాభాయ్ స్పేస్​ సెంటర్​ డైరక్టర్​గా సోమ్​నాథ్​ సేవలు అందించారు.






ప్రస్తుత ఇస్రో ఛైర్మన్ శివన్ పదవీ కాలం ముగియడంతో సోమ్​నాథ్​ను ఆయన వారసుడిగా ఇటీవలే ఎంపిక చేసింది నియామకాల కేబినెట్ కమిటీ.







ప్రొఫైల్..



  1. కొల్లాంలోని టీకేఎమ్ కళాశాలలో సోమ్‌నాథ్‌ బీటెక్ చదివారు.

  2. అనంతరం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో మాస్టర్స్ పూర్తి చేశారు.

  3. ఆయన 1985లో ఇస్రోలో చేరారు. అనంతరం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV)కి సంబంధించిన ప్రయోగాల్లో కీలకంగా వ్యవహరించారు. 

  4. తిరువనంతపురంలోని లిక్విడ్ పొప్రల్షన్ సిస్టమ్స్ సెంటర్ (LPSC)కు 2015లో డైరెక్టర్‌గా సోమ్‌నాథ్ నియమితులయ్యారు.

  5. 2003లో GSLV Mk-III ప్రాజెక్టులో డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా సోమ్‌నాథ్ ఉన్నారు.

  6. 2010- 2014 వరకు సోమ్‌నాథ్ GSLV Mk-III ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

  7. 2014 డిసెంబర్ 18న ఆయన నేతృత్వంలోనే కేర్‌ మిషన్‌కు చెందిన తొలి ప్రయోగాత్మక విమానం విజయవంతమైంది.


జీఎస్​ఎల్వీ ఎంకే- 3 అభివృద్ధికి అందించిన సేవలకు గాను సోమ్​నాథ్​ టీమ్​ ఎక్స్​లెన్స్​ అవార్డు అందుకున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా మెరిట్​ అవార్డ్​, పర్ఫామెన్స్​ ఎక్సలెన్స్​ అవార్డ్​లతో ఇస్రో సత్కరించింది.


స్పేస్​ గోల్డ్​ మెడల్, నేషనల్​ ఏరోనాటిక్స్​ ప్రైజ్​తో ఆస్ట్రోనాటికల్​ సొసైటీ ఆఫ్​ ఇండియా (ఏఎస్​ఐ) సత్కరించాయి.


Also Read: ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!


Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి