DMK MLA:  వెంకటేష్, విజయశాంతి నటించిన చినరాయుడు సినిమా చూశారా? సూపర్ హిట్ సినిమాల్లో టీవీల్లో..యూట్యూబ్‌లోనూ ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటుంది.ఈ సినిమాలో విజయశాంతి ఓ చోట డబ్బులు అవసరమైతే చదివింపుల విందు ఏర్పాటు చేస్తుంది. భోజనానికి వచ్చిన వాళ్లంతా తిన్న తర్వాత విస్తరాకుల కింద తమ కు తోచినంత  పెట్టి వెళ్తూ ఉంటారు. ఈ సీన్ అప్పట్లో చాలా ఆసక్తి రేకెత్తించింది. నిజానికి ఇలా చదవింపుల విందు పెట్టడం తమిళనాడులో ఓ సంప్రదాయం. ఆ సినిమా తమిళ్ సినిమాకు రీమేక్ కాబట్టి.. ఆ సీన్‌ను అలానే ఉంచేశారు తెలుగులో కూడా. అయితే దశాబ్దాలు గడుతున్నా ఆ సంప్రదాయం తమిళనాడులో ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఓ డీఎంకే ఎమ్మెల్యేగా ఇలానే ఏర్పాటు చేసిన చదివింపుల విందు హైలెట్ అవుతోంది. 


పేరావూరణి ఎమ్మెల్యే  చదివిందుల విందు భోజనం


పేరావూరణి నియోజకవర్గ డీఎంకే ఎమ్మెల్యే అశోక్‌కుమార్‌ మనవడి చెవులు కుట్టే వేడుక, చదివింపుల విందు ఒకేసారి నిర్వహించారు. వేడుకలో మాంసాహారులకు, శాకాహారులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. చదివింపుల సమర్పించే వారి కోసం 40 కౌంటర్లు ఏర్పాటు చేసి వసూలు చేశారు.  వేడుకలో రూ.10 కోట్ల చదివింపులు వచ్చాయి.



40 మంది ఎమ్మెల్యేలను భాజపా కొనాలని చూస్తోంది, ఆప్ సంచలన ఆరోపణలు


తంజావూర్‌, పుదుకోట్టై తదితర జిల్లాల్లో చదివింపుల విందు వేడుక వందేళ్లుగా నిర్వహిస్తున్నారు. తమ ఆర్థిఖ స్థోమత బట్టి విందు ఏర్పాటుచేస్తారు. విందుకు వచ్చిన వారు చదివించిన నగదుతో తమ జీవనాన్ని మెరుగుపరుచుకుంటారు. సాయం కోసం ఎవరి దగ్గర చేయి చాచకుండా కష్టంలో ఉండే బంధువులకు చేయూతనిచ్చేందుకు ఈ ఆచారాన్ని ప్రారంభించారు. ఒకసారి చదివింపుల విందు నిర్వహిస్తే మళ్లీ ఐదేళ్ల తర్వాతనే ఏర్పాటు చేయాలన్న నిబంధన ఉంది.  


సీఎంపై అనర్హతా వేటు వేయండి, ఎన్నికల సంఘం సూచన - గవర్నర్‌కు లేఖ


చదివింపుల విందు నిర్వహించడం తమిళనాడులో సంప్రదాయం


ఇలా నిధులు సమీకరించుకోవడాన్ని ఎవరూ తక్కువగా చూడరు. అదో సంప్రదాయం కూడా. దశాబ్దాల నుంచి ఉందని పలువురు సోషల్ మీడియాలో చెబుతున్నారు. 



అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతోనే ఇంత భారీగా చదివింపులు వచ్చాయన్న వాదన కూడా ఉంది. అయితే ఇలాంటి విందులపై విపక్షాలు కూడా పెద్దగా విమర్శలు చేయరు.  మరికొంత మంది కూడా ఇలాంటి విందులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ వారికి పెద్దగా  ప్రచారం లభించదు. కానీ డీఎంకే ఎమ్మెల్యేకు చదివింపులు ఎక్కువగా రావడంతో  మీడియా.. సోషల్ మీడియాలో హైలెట్ అయింది. 


ఆ ఫోన్లు పెగాసస్‌కు గురైనట్టు ఆధారాల్లేవు, సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు