Delhi Liquor Policy Case: దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్‌ఆద్మీకి చెందిన మరో ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) సోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు నోటీసులు అందుకున్న ఆప్ ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరుకుంది.
ఇప్పటికే ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది అందజేసింది. తాజాగా ఈ జాబితాలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్ చేరారు.
ఆప్ ఆగ్రహం
అయితే మరో ఎమ్మెల్యేకు నోటీసులు ఇవ్వడంపై దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ కేసు
దిల్లీలో గతేడాది నవంబరులో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరగడం సహా విధానపరమైన లోపాలున్నట్లు దిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చారు. టెండర్ల విధానంలో కొందరికి ఆయాచిత లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. కేంద్ర దర్యాప్తు సంస్థకు సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌శాఖకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మనీశ్ సిసోడియా పాత్రనూ అందులో ప్రస్తావించారు.
దీంతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సిసోడియా సహా మొత్తం 15 మంది వ్యక్తులు, ఓ కంపెనీ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఈ క్రమంలోనే ఆగస్టు 19న సిసోడియా నివాసం సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఇటీవల ఘజియాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఉన్న సిసోడియా బ్యాంకు లాకర్‌ను కూడా ఆయన సమక్షంలో సీబీఐ పరిశీలించింది.
Also Read: Viral Video: మానవత్వం లేని డాక్టర్- కుక్కను కారుకు కట్టేసి, కిలోమీటర్లు లాక్కెళ్లి!
Also Read: Kejriwal On AAP Party: 'ఆప్ పుట్టుకకు దేవుడే కారణం- గుజరాత్‌లో మా విజయం తథ్యం'