Gold Price Today: భారతీయులకు అత్యంత ప్రియమైన పసిడి ధర మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. మల్టీ కమొడిటీ ఎక్సేంజ్ ఆఫ్ ఇండియాలో (MCX) గోల్డ్ ఫ్యూచర్స్ గత వారం ట్రేడ్స్‌లో భారీగా పడిపోయింది. అయితే 100-WMA మద్దతును పట్టుకోగలిగింది. ఒకవేళ, ఈ ఎల్లో మెటల్ 100-WMA పట్టు నుంచి కూడా జారిపోతే, మరో 10 శాతం షార్ఫ్ ఫాల్ ఉండొచ్చని మార్కెట్ ఎక్స్‌పర్ట్‌ల అంచనా. వెండిలో రికవరీ ఉన్నప్పటికీ, మొత్తం ట్రెండ్ సిల్వర్ ఫ్యూచర్స్‌కు అనుకూలంగా మారాలంటే మాత్రం చాలా అడ్డంకులను అధిగమించాలి.
బంగారం (Gold)
సెంటిమెంట్: ప్రతికూలం
చివరి ముగింపు: రూ.49,334
మద్దతు: రూ.48,900
నిరోధం: రూ.50,025; రూ.51,000
గోల్డ్ గత వారం ట్రేడ్‌లో 2.3 శాతం పతనమైంది. MCX గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ 100-WMA (వీక్లీ మూవింగ్ యావరేజ్) దగ్గర రూ.48,900 స్థాయిలో మద్దతును పరీక్షిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ కమోడిటీ, దాని 20-WMA అయిన రూ.51,000, 50-WMA అయిన రూ.50,025 కన్నా దిగువన ట్రేడవుతోంది. ఇలా జరగడం ఈ ఏడాది జనవరి 30 తర్వాత ఇదే మొదటిసారి.
రూ.48,900 - రూ.51,000 మధ్య ఉన్న ట్రేడింగ్ జోన్ గోల్డ్ ఫ్యూచర్స్‌కు అత్యంత కీలకం. గోల్డ్ 20-WMA మార్కును జయించనంత వరకు, పైకి ఎదిగే అవకాశాలు పరిమితంగా ఉండే అవకాశం ఉంది.
మరోవైపు, దాని 100-WMA దిగువకు బ్రేక్ అయ్యి, పైకి రాలేకపోతే మాత్రం, రూ.44,250 వద్ద ఉన్న 200-WMA వైపు పదునైన పతనం కనిపించే అవకాశం ఉంది.
కీలక మొమెంటం ఓసిలేటర్లు (RSI , MACD) డైలీ, వీక్లీ చార్టుల్లో ఎలుగుబంట్లకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి, లాంగ్ పొజిషన్లు తీసుకున్నవాళ్లు అప్రమత్తంగా ఉండాలి.
వెండి (Silver)
సెంటిమెంట్: జాగ్రత్త అవసరం
చివరి ముగింపు: రూ. 56,729
నిరోధం: రూ. 57,850; రూ.58,380
మద్దతు: రూ.56,010; రూ.54,720
సిల్వర్ ఫ్యూచర్స్ తిరిగి పుంజుకున్నాయి. గత ఐదు ట్రేడింగ్ వరుస సెషన్లలో 20, 50-DMA (డైలీ మూవింగ్ యావరేజ్) కంటే పైన నిలదొక్కుకోగలిగాయి. ఈ మూమెంట్‌ను బట్టి; 20-DMA అయిన రూ.54,720, 50-DMA అయిన రూ.56,010 పైన సిల్వర్ ఫ్యూచర్స్ కదిలినంత కాలం, సమీప కాల వృద్ధి మీద ఇన్వెస్టర్లు ఆశలు పెట్టుకోవచ్చు. అదే సమయంలో జాగ్రత్తగానూ ఉండాలి.
ఒకవేళ, ఈ మద్దతు స్థాయిలను కాపాడుకోవడంలో ఈ కమొడిటీ విఫలమైతే, బోలింగర్ బ్యాండ్ లోయర్ ఎండ్‌ను మళ్లీ పరీక్షించే ఛాన్సు ఉంది. తద్వారా రూ.51,600 స్థాయికి తగ్గే అవకాశం ఉంది.
అప్‌సైడ్‌లో.. డిసెంబర్ ఫ్యూచర్స్ దాదాపు రూ.57,850 - రూ.58,380 స్థాయిలో గట్టి ప్రతిఘటనను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇవి, వరుసగా, బోలింగర్ బ్యాండ్ హయ్యర్ ఎండ్, 100-DMA స్థాయిలు (డైలీ ఛార్ట్). ప్రస్తుతం 200-DMA అయిన రూ.61,530కి దాదాపు సమాన స్థాయిలో ఈ మెటల్ ట్రేడవుతోంది.
వీక్లీ చార్ట్‌లో, సిల్వర్ ఫ్యూచర్స్ 20-WMA (వీక్లీ మూవింగ్ యావరేజ్) అయిన రూ.58,240 స్థాయిని పరీక్షించడం కనిపిస్తోంది. 200-WMA స్థాయి రూ.54,720 వద్ద మద్దతు ఉంది.
కీలక మొమెంటం ఓసిలేటర్లు (RSI , MACD) డైలీ చార్ట్‌లో ఎద్దులకు అనుకూలంగా ఉన్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.