Atal Canteens to provide food to the poor in Delhi: ఢిల్లీలో పేదల కడుపు నింపేందుకు బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అటల్ క్యాంటీన్లను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈ పథకాన్ని 2025 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ ఉపన్యాసంలో అధికారికంగా ప్రకటించారు.
అటల్ క్యాంటీన్లు ఢిల్లీలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, ముఖ్యంగా కార్మికులు, రోజువారీ కూలీలు, నిరుపేదలకు నివాసులకు రూ. 5కి పోషకాహారం అందించే ఉద్దేశంతో ప్రారంభిస్తున్నారు. సబ్సిడీ ఆహార క్యాంటీన్లు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ జన్మ శతజయంతి సందర్భంగా ఆయన పేరిట ప్రారంభిస్తారు. ఈ పథకం తమిళనాడులోని అమ్మ క్యాంటీన్లు, కర్ణాటకలోని ఇందిరా క్యాంటీన్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్న క్యాంటీన్ల తరహాలో ఉంటాయి.
2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఈ క్యాంటీన్ల స్థాపన కోసం రూ. 100 కోట్లు కేటాయించారు. మొదటి దశలో ఢిల్లీలోని స్లమ్ క్లస్టర్లు, నిర్మాణ స్థలాల సమీపంలో 100 అటల్ క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్యాంటీన్లు ప్రధానంగా స్లమ్ నివాసులు, రోజువారీ కూలీలు, విద్యార్థుల వంటి ఆర్థికంగా ఇబ్బంది పడే వారికి సరసమైన ఆహారాన్ని అందించే చోట ఏర్పాటు చేస్తారు. ఒక్కో భోజనం ధర కేవలం రూ. 5గా నిర్ణయించారు. క్యాంటీన్ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
తమిళనాడులోని అమ్మ క్యాంటీన్లg, కర్ణాటకలోని ఇందిరా క్యాంటీన్లు, ఏపీలో అన్న క్యాంటీన్లు తరహాలో నిర్వహిస్తారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు ఒక్క ఇడ్లీ రూ. 1, కర్డ్ రైస్ రూ. 3, సాంబార్ రైస్ రూ. 5 వంటి ధరలతో అత్యంత ప్రజాదరణ పొందాయి. ఈ క్యాంటీన్లలో స్వయం సహాయక బృందాల మహిళలు ఆహారాన్ని వండి, వడ్డిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లు రూ. 5కు రోజుకు మూడు పూటలా భోజనం, యు కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్లు రూ. 5కు అల్పాహారం, రూ. 10కు భోజనం కూడా ఇదే తరహాలో విజయవంతంగా నడుస్తున్నాయి. హర్యానాలో అటల్ కిసాన్ మజ్దూర్ క్యాంటీన్లు కూడా రూ. 10కు ఆహారాన్ని అందిస్తున్నాయి ఈ క్యాంటీన్లు ప్రధానంగా నిరుపేదలు , రోజువారీ కూలీలు, నిర్మాణ కార్మికులు, ఆర్థికంగా ఇబ్బంది పడే విద్యార్థుల ఆకలి తీరుస్తున్నాయి.
అటల్ క్యాంటీన్లతో పాటు, రేఖా గుప్తా స్లమ్ నివాసులకు పక్కా ఇళ్లు, గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డు, యమునా నది శుద్ధీకరణ, ఢిల్లీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రణాళికలను ప్రకటించారు .