Vijay Sethupathi's Sir Madam OTT Release On Amazon Prime Video: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'తలైవన్ తలైవి' తెలుగులో సర్ మేడమ్. ఈ నెల 1న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోగా... తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ తాజాగా ఓ పోస్టర్ పంచుకుంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉండనుంది. 'ఆకాశవీరయ్య, రాణిలతో ప్రేమలో పడేందుకు రెడీగా ఉండండి.' అంటూ అమెజాన్ ప్రైమ్ తెలిపింది.
ఈ మూవీకి పాండిరాజ్ దర్శకత్వం వహించగా... విజయ్ సేతుపతి, నిత్యా మేనన్‌లతో పాటు కమెడియన్ యోగిబాబు, రోషిని హరిప్రియన్, మైనా నందిని, దీప శంకర్, శరవణన్, కాళీ వెంకట్, వినోద్ జోస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
Also Read: మీ ఇల్లు కాదు... ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్లండి - ఫోటోగ్రాఫర్లపై ఆలియా భట్ ఆగ్రహం
స్టోరీ ఏంటంటే?
ఆకాశ వీరయ్య (విజయ్ సేతుపతి) చుట్టు పక్కల గ్రామాల్లో చేయి తిరిగిన పరోటా మాస్టర్. సొంతూరిలోనే ఫ్యామిలీతో కలిసి హోటల్ నడుపుతూ జీవిస్తుంటాడు. వీరయ్య కోసం పక్క ఊరిలోనే ఓ మంచి సంబంధం చూస్తారు అతని పేరెంట్స్, బంధువులు. ఆ అమ్మాయి పేరు రాణి (నిత్యా మేనన్). ఆమెను చూసిన తొలి చూపులోనే ప్రేమలో పడతాడు వీరయ్య. తొలుత వీరిద్దరి పెళ్లికి పెద్దలు ఒప్పుకొన్నా... ఆ తర్వాత వాళ్ల కుటుంబాల గురించి తెలిసి వద్దనుకుంటారు.
అయితే, అప్పటికే రాణి, వీరయ్య ఇష్టంలో మునిగి తేలుతుంటారు. తమ కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో వారిని కాదని ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకుంటారు. పెళ్లైన కొత్తలో కొంతకాలం బాగానే ఉన్నా... ఆ తర్వాత ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఓ దశలో అవి చిలికి చిలికి గాలివానలా మారడంతో పెద్దలు ఎంటర్ అవుతారు. కపుల్ మధ్య గొడవలు పెద్దలకు చేరడంతో ఇరు కుటుంబాల మధ్య కూడా గొడవ మొదలవుతాయి. ఈ క్రమంలోనే రాణి వీరయ్య ఇద్దరూ డివోర్స్ తీసుకోవాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు వారిద్దరి మధ్య గొడవలకు కారణమేంటి? పెద్దలు ఎందుకు వీరిద్దరి పెళ్లికి ఒప్పుకోలేదు? వీరి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి? చివరకు వీరిద్దరూ ఒక్కటయ్యారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను అమెజాన్‌లో చూసెయ్యండి.