Delhi Excise Policy Case: లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించి దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సమన్లు జారీ చేసింది. విచారణ కోసం సోమవారం హాజరుకావాలని మనీశ్ సిసోడియాకు సీబీఐ పేర్కొంది. ఈ సమన్లపై మనీశ్ సిసోడియా స్పందించారు.
లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ వారం ప్రారంభంలో 25కు పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
ఇదీ కేసు
దిల్లీలో గతేడాది నవంబరులో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరగడం సహా విధానపరమైన లోపాలున్నట్లు దిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చారు. టెండర్ల విధానంలో కొందరికి ఆయాచిత లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. కేంద్ర దర్యాప్తు సంస్థకు సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌శాఖకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మనీశ్ సిసోడియా పాత్రనూ అందులో ప్రస్తావించారు.
దీంతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సిసోడియా సహా మొత్తం 15 మంది వ్యక్తులు, ఓ కంపెనీ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఈ క్రమంలోనే ఆగస్టు 19న సిసోడియా నివాసం సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఇటీవల ఘజియాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఉన్న సిసోడియా బ్యాంకు లాకర్‌ను కూడా ఆయన సమక్షంలో సీబీఐ పరిశీలించింది.
Also Read: Xi Jinping Third Term: వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్- ఈ సారి టార్గెట్ తైవాన్!