December 22 History:


చరిత్రలో నిలిచిపోయిన రోజు..


డిసెంబర్ 22. ఈ తేదీకి చాలా స్పెషాల్టీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కీలక సంఘటనలన్నీ ఈ తేదీనే జరిగాయి. చరిత్ర ఎప్పటికీ మరిచిపోలేనివే అవన్నీ. 2010లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన చట్టం తీసుకొచ్చింది డిసెంబర్ 22నే. సైన్యంలో హోమో సెక్సువల్స్‌కూ అధికారిక గుర్తింపునిస్తూ చట్టం తీసుకొచ్చారు. ఇది ఇప్పటికీ సంచలనమే. ఇండియాలో మొట్టమొదటి గూడ్స్‌ రైలుని నడిపింది కూడా ఈ రోజే. ఇలాంటి సంఘటలెన్నో ఇదే రోజున జరిగాయి. అవేంటో ఓ సారి చూద్దాం. 


ఇవే ఆ సంఘటనలు..


1. 1851లో డిసెంబర్ 22న భారత్‌లో తొలిసారి గూడ్స్ ట్రైన్‌ను నడిపారు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 
2. 1882లో తొలిసారి క్రిస్మస్ ట్రీని థామల్ అల్వా ఎడిసన్ తయారు చేసిన బల్బ్‌లతో అలంకరించారు. 
3. 1910లో అమెరికాలో తొలిసారి పోస్టల్ సేవింగ్స్‌ లెటర్‌లు జారీ చేసింది ఈ రోజునే. 
4.  ర్యాడికల్ డెవలప్‌మెంట్ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ఎమ్‌ నాథ్ రాయ్‌ ప్రకటించారు. 
5.  1971లో అప్పటి సోవియట్ యూనియన్ భూగర్భంలో అణు పరీక్షలు నిర్వహించింది. 
6. 1972లో డిసెంబర్ 22న ఘోర విషాదం జరిగింది. నికరాగువా రాజధాని మనగువాలో భీకర భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో 12వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 
7. 1972లో డిసెంబర్ 22న ప్రపంచం నివ్వెరపోయే సంఘటన జరిగింది. చిలీలో ఓ విమానం క్రాష్ అయింది. అయితే...ఇది జరిగిన 2 నెలల తరవాత  ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డ 14 మందిని ఎయిర్‌ఫోర్స్ గుర్తించింది.
8. 1989లో ఇదే రోజున రొమానియాలో నియంత నికోలే చీకటి పాలనకు తెరపడింది. దాదాపు 24 ఏళ్ల పాటు పరిపాలించిన ఆయన...దేశం విడిచి పారిపోతుండగా అరెస్ట్ అయ్యాడు. 
9. 1990లో క్రొయాటియా దేశ రాజ్యాంగాన్ని గుర్తించడంతో పాటు అక్కడి పౌరులకు అన్ని హక్కులూ కల్పించారు. 
10. 2010లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హోమో సెక్సువల్స్‌నీ ఆర్మీలోకి తీసుకునేందుకు వీలయ్యే చట్టాన్ని తీసుకొచ్చారు. 


2022 రౌండప్..


మరి కొద్ది రోజుల్లో కొత్త ఏడాది ప్రారంభం కానుంది. సరికొత్త ఆశలతో 2023కి వెల్‌కమ్ చెప్పేందుకు అంతా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది కాలంలో ఎన్నో మార్పులొచ్చాయి. మరెన్నో గుర్తుపెట్టుకునే సంఘటనలు జరిగాయి. వాటిలో కొన్ని మంచివి ఉన్నాయి. మరికొన్ని బాధ పెట్టినవీ ఉన్నాయి. ఆ కీలక సంఘటనలేంటో ఓ సారి గుర్తు చేసుకుందాం. 2022ని చాలా హుషారుగా మొదలు పెట్టిన తొలి రోజే...అంటే జనవరి 1వ తేదీనే అందరినీ బాధ పెట్టే సంఘటన జరిగింది. కొత్త ఏడాదిలో శుభారంభం కోసం మాతా వైష్ణోదేవి ఆలయానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు భక్తులు. ఆ సమయంలోనే కొందరు మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడం వల్ల సిబ్బంది వాళ్లను కంట్రోల్ చేయలేకపోయింది. ఫలితంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబ సభ్యులకు ఈ చేదు వార్త కలిచి వేసింది. ఆ తరవాత ఫిబ్రవరిలోనూ ఈ విషాదం కొనసాగింది. భారతరత్న, గానకోకిల లతా మంగేష్కర్ (92) ఫిబ్రవరి 6వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఇక రాజకీయాల పరంగా చూస్తే...ఈ ఏడాది అన్ని పార్టీలకు అత్యంక కీలకమైంది. ఏడాది మొదట్లోనే మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లో ఎన్నికల యుద్దం చాలా ఉత్కంఠగా సాగింది.


Also Read: Jaya Prada: సినీనటి, మాజీ ఎంపీ జయప్రదకు అరెస్ట్ వారెంట్‌, ఆ కేసు విచారణకు రాలేదని కోర్టు ఆగ్రహం