Dead Body in Plane Wheel : హవాయి ద్వీపంలోని కహులుయీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విమానంలోని టైరులో మృతదేహం కనిపించింది. డెడ్ బాడీని గుర్తించిన అధికారులు.. అసలు ఈ టైరులోకి మృతదేహం ఎప్పుడు ఎలా వచ్చింది.? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలోని చికాగోలోని ఓహే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానం వచ్చినట్టు సమాచారం. విమానం బయటి నుంచి మాత్రమే ఎవరైనా ఈ వీల్ వెల్‌లోకి వెళ్లేందుకు యాక్సెస్ ఉంటుంది. మరి ఆ వ్యక్తి అక్కడికి ఎలా వెళ్లాడు అన్న విషయం ఇంకా తెలియలేదని ఎయిర్ లైన్ ప్రతినిధి తెలిపారు.
'ఫ్లైట్ 202 చికాగో ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి డిసెంబర్ 24న (మంగళవారం) స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:31 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:12 గంటలకు మౌయ్‌లోని కహులుయి విమానాశ్రయంలో దిగింది. ల్యాండింగ్ తర్వాత, "యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లోని మెయిన్ ల్యాండింగ్ గేర్‌లలో ఒకదాని వీల్ వెల్‌లో ఒక మృతదేహం కనుగొన్నాం' అని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read : VRS For Wife: విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!
మరోపక్క వ్యక్తి మరణంపై డిపార్ట్‌మెంట్ విచారణ జరుపుతోందని డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి అలానా కె. పికో తెలిపారు. దర్యాప్తుపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో కలిసి పనిచేస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. చట్టవిరుద్ధంగా ప్రయాణించడానికి ప్రయత్నించే వ్యక్తులు ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు ఈ విధంగా చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఇలా చేసే వారు మళ్లీ బయటకు వచ్చేటప్పుడు బతికే ఉంటారని నమ్మకం ఉండదు. అలాంటి అవకాశాలూ తక్కువే. ఎందుకంటే ఈ వీల్ వెల్ చాలా ఇరుకుగా ఉంటుంది. ల్యాండింగ్ గేర్ వెనక్కి తిప్పినపుడు ఇందులో ఉన్న వ్యక్తి చనిపోయే అవకాశం ఉంటుంది.
2023లోనూ ఓ వ్యక్తి విమానం వీల్ వెల్‌లోకి వెళ్లాడు. కానీ అతను ఆశ్చర్యంగా బతికిపోయాడు. విమానంలోని అండర్ క్యారేజ్ బేలో ప్రయాణించిన ఆ వ్యక్తిని విమానం సిబ్బంది సేఫ్‌గా బయటికి తీసుకువచ్చారు. అప్పట్లో ఈ ఘటన ఫ్రాన్స్‌లో చోటు చేసుకుంది. 2021లోనూ గ్వాటెమాల నుంచి మయామికి వెళ్లే విమానంలో 26 ఏళ్ల వ్యక్తి.. విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో దాక్కుని ప్రాణాలతో బయటపడ్డాడని అధికారులు తెలిపారు. 2019 లో, కెన్యాలోని నైరోబీ నుండి హీత్రూ విమానాశ్రయానికి వెళ్లే విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్ నుంచి పడిపోయినట్లు భావిస్తున్న వ్యక్తి మృతదేహం నైరుతి లండన్‌లోని ఇంటి పెరట్లో దిగింది.
Also Read : Pakistan Beggars: పాకిస్తాన్‌లో నెంబర్ వన్ ఉద్యోగం అడుక్కోవడమట - లక్షల్లో బిచ్చగాళ్లు - ఇలా అయిపోతోందంటి ?