Natural Immunity Boosters : చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఇమ్యూనిటీ త్వరగా తగ్గిపోతుంది. రోగనిరోధక శక్తి తగ్గిపోయినప్పుడు జలుబు, దగ్గు, ఇతర వైరస్​లో సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని డ్రింక్స్​ని తాగడం వల్ల ఈ సమస్యలు రావంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ డ్రింక్స్ ఏంటి? వాటిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి? అవి జలుబు, దగ్గును తగ్గించి.. రోగనిరోధక శక్తిని ఎలా పెంచుతాయో ఇప్పుడు చూసేద్దాం. 


సాల్ట్ వాటర్​తో


సాల్ట్ వాటర్​ని తాగాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్ర లేవగానే సాల్ట్ వాటర్​ని నోటిలో వేసుకుని పొక్కిలించాలి. దీనివల్ల గొంతు సమస్యలు తగ్గుతాయి. దగ్గు కంట్రోల్ అవుతుంది. ఇది నోటిలోని బ్యాక్టీరియాను క్లీన్ చేస్తుంది. 


నిమ్మరసంతో.. 


నిమ్మరసాన్ని.. తేనెను సమపాళల్లో కలిపి తీసుకుంటే గొంతు సమస్యలు తగ్గుతాయి. తేనెలోని యాంటీబాక్టీరియల్ లక్షణాలు గొంతునొప్పి నుంచి ఉపశమనం ఇస్తాయి. అలాగే నిమ్మరసంలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మరసాన్ని, తేనెను నేరుగా తీసుకున్నా.. గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకున్నా మంచి ఫలితాలుంటాయి. 


అల్లం టీ


అల్లంతో టీ చేసుకుని వేడి వేడిగా తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలోని యాంటీఇన్​ఫ్లమేటరీ లక్షణాలు దగ్గు, జలుబు, గొంతు సమస్యలను దూరం చేస్తాయి. అల్లాన్ని టీలో వేసుకుని తీసుకున్నా.. లేదా అల్లం ముక్కలను నీటిలో మరిగించి తీసుకున్నా పర్లేదు. కానీ మిల్క్​ టీ కంటే.. నేరుగా పెట్టుకునే అల్లంటీతోనే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. రోజుకు దీనిని రెండు కప్పులు తీసుకుంటే మంచిది. తేనె కలిపి కూడా తాగవచ్చు. 


చికెన్ సూప్


చలికాలంలో చికెన్​ సూప్​ని వేడివేడిగా తాగితే.. చాలా మంచిగా ఉంటుంది. చలి దూరమవుతుంది. అలాగే దానిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు మిమ్మల్ని వెచ్చగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. శరీరాన్ని హైడ్రేటెడ్​గా ఉంచుతాయి. జలుబు సమయంలో ముక్కు దిబ్బడ ఉంటే.. అది కూడా దూరమైపోతుంది. దీనిలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి మీరు చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చికెన్​ సూప్​ని ట్రై చేయవచ్చు.


పాలల్లో పసుపు


శీతాకాలంలో అత్యంత బెస్ట్​ డ్రింక్​లలో ఇది ఒకటి. జలుబు, దగ్గు సమస్యలన్ని దూరం చేసుకోవాలనుకున్నా.. ఇమ్యూనిటీ పెంచుకోవాలనుకున్నా రోజూ.. పాలల్లో పసుపు కలుపుకొని తాగాలి. రుచికోసం తేనెను కూడా వేసుకోవచ్చు. రోజూ రాత్రి పడుకునే ముందు దీనిని తాగితే మంచి ఫలితాలుంటాయి. 



ఈ డ్రింక్స్ చలికాలంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచి.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే జలుబు, దగ్గు రాకుండా కాపాడుతాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వీటిని తీసుకోవచ్చు. అయితే వీటిని తీసుకునే ముందు వైద్యులు, నిపుణుల సలహా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. 


Also Read : పెరిగిన చలి తీవ్రత.. ఈ టిప్స్ ఫాలో అయితే చలి తగ్గుతుంది, లేదంటే కష్టమే





గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.