ఇపుడిపుడే కోలుకొంటున్న అనంతపురంలో మరో సమస్య ముంచుకొస్తుంది. ఇప్పటికే అటవీ ప్రాంతం తక్కువ వుండడంతో పెద్ద ఎత్తున కోట్లలో మొక్కల పెంపకం చేపట్టిన ప్రభుత్వం ఉన్న చెట్లను నిర్దాక్షిణ్యంగా కొట్టివేస్తుంటే పట్టించుకోవడం లేదు. వాటిని ఆపాల్సిన అధికారులు సైలెంట్‌గా ఉండిపోతున్నారు. దీంతో వందల చెట్లు కుప్పకూలుతున్నాయి. ఫలితంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోంది. ముఖ్యంగా పక్షుల సంఖ్య తగ్గిపోతుంది. ఈ సమస్యే అనంతపురంలో తీవ్రమవుతోందని సామాజికవేత్తలరు ఆందోళన చెందుతున్నారు.
ఎప్పుడైతే చెట్లు కొట్టివేస్తామో ఆటోమేటిక్ గా వాటిపై ఆధారపడి జీవించే పక్షులు వలస వెళ్లిపోతాయి. మరికొన్ని అంతరించిపోతున్నాయి అని అంటున్నారు పక్షి ప్రేమికులు. అనంతపురం జిల్లాలో ఎన్ని రకాల పక్షులున్నాయి. వాటికి ఉన్న సమస్యలేంటి... అనంతపురంలో కనించకుండాపోతున్న పక్షుల రకాలు ఎన్ని అన్నవి ప్రభుత్వం వద్ద డేటా లేదు. కేవలం గ్రీన్ అనంత పేరుతో చెట్లను సంరక్షించే కార్యక్రమం చేపట్టిన తర‌్వాత అనేక సమస్యలు వెలుగులోకి వచ్చినట్లు చెప్తున్నారు
అనంతపురంలో పక్షులు సొంత గూడుకట్టుకొనే సామర్థ్యం కోల్పోతున్న టైంలో గ్రీన్ అనంత సభ్యులు. బర్డ్స్ ఫర్ హోం పేరుతో పక్షులకు గూళ్లు ఏర్పాటు చేస్తున్నారు ఈ సంస్థ నిర్వహకుడు సామాజికవేత్త అనిల్ కుమార్.
ప్లెక్సీల కోసం చెట్లకు కొట్టిన మేకలు, బోర్డులు తొలగిస్తున్నారు గ్రీన్ అనంత సభ్యులు. చెట్లకు మేకులు కొట్టే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు గ్రీన్ అనంత నిర్వాహకులు. అనంతపురంలో నాలుగువేల గూళ్ళు ఏర్పాటు చేశామన్నారు. చాలా చోట్ల పక్షులు ఈ గూళ్ళు వినియోగించుకొంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే వీళ్ల లెక్కల ప్రకారం అనంతపురంలో 130రకాల పక్షులు ఉండగా వాటిలో దాదాపు 24రకాల పక్షులు కనబడటం లేదంటున్నారు ఈ సభ్యులు
ప్రజల నుంచి ఆశించిన సహకారం ఇప్పటికి అందడం లేదని, ఇది తమ బాధ్యత కాదని పీలవుతున్నారంటూ గ్రీన్ అనంత సభ్యురాలు ఆయేషా. చెట్లు కొట్టిన చోటే ప్రజలు ఏకమై ప్రశ్నిస్తే వృక్షాలను కాపాడుకోవచ్చని అంటున్నారు.
అనంతపురం జిల్లా ఎడారిగా మారకుండా ఉండాలంటే విరివిగా చెట్లు పెంచాలని గుర్తించిన ప్రభుత్వం..ప్రతిఏటా కోట్ల కొద్ది మొక్కలను నాటుతుందని. వాటిలో ఎన్ని చెట్లుగా మారాయి అన్న డేటా మాత్రం అధికారుల వద్ద లేకపోవడంపై గ్రీన్ అనంత సభ్యులు ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందో అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలంటున్నారు గ్రీన్ అనంత సభ్యులు. ఇప్పటికైనా, ప్రభుత్వం, ప్రజలు స్పందించి మొక్కల పెంపకమే కాదు, ఉన్న చెట్లను సంరక్షించడం ద్వారా వాతావరణ సమతుల్యతే కాదు, పర్యావరణ సమతుల్యతను కాపాడినవారు అవుతారుంటన్నారు నిర్వాహకులు. ఎక్కడైనా చెట్లు కొడుతుంటే సంబంధిత అదికారులకు సమాచారం ఇవ్వాలని లేకపోతే తమకు సమాచారం ఇస్తే వచ్చి అడ్డుకొంటామంటున్నారు గ్రీన్ అనంత నిర్వాహకులు.