జవాద్ తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడినప్పటికీ ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తర దిశగా ప్రయాణిస్తోన్న జవాద్.. ఈరోజు ఒడిశాలోని పూరీ తీరానికి చేరనుంది. అప్పటికి ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారనుందని వాతావరణశాఖ తెలిపింది.
భారీ వర్షాలు..
ఒడిశాలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంజామ్, కుర్దా, కేంద్రపరా, జగత్‌సింగ్‌పుర్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. గంజామ్ జిల్లా ఖాలీకోట్‌లో 158 మిమీ వర్షపాతం నమోదైంది. నయాగర్ (107.5 మిమీ), ఛత్రాపుర్ (86.6 మిమీ), భువనేశ్వర్ (42.3 మిమీ)లో వర్షపాతం కురిసింది.
ఈరోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్ర సగటు వర్షపాతం 11.8 మిమీగా నమోదైనట్లు వెల్లడించింది. ముందస్తు చర్యలుగా పూరీ తీరంలో ప్రదల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు.
Also Read: Omicron Symptoms: లైట్‌గా జలుబు ఉందా? లైట్ తీసుకోవద్దు.. ఒమిక్రాన్‌కు అదే ప్రధాన లక్షణమట!
Also Read: Sabarimala Rush: ఒమిక్రాన్ భయాల వేళ పోటెత్తిన శబరిమల.. రికార్డ్ స్థాయిలో 42 వేల మందికి దర్శనం
Also Read: Omicron Cases in India: 'ఒమిక్రాన్‌కు వేగం ఎక్కువ.. కానీ లక్షణాలు స్వల్పమే'
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 2,796 మంది మృతి.. దిల్లీలో తొలి ఒమ్రికాన్ కేసు
Also Read: ఇలాంటి పేపర్ ప్లేట్లలో రోజూ భోజనాలు లాగిస్తున్నారా? అయితే ఈ రోగాలు రాక తప్పవు
ప్రజా క్షేమమే తమకు అత్యంత ముఖ్యమని, స్థానికులు, పర్యటకులను ఇప్పటికే సముద్రం తీరం నుంచి ఖాళీ చేయించామని పూరీ ఎస్పీ కేవీ సింగ్ తెలిపారు.