COVID Cases In India: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా 3,545 కరోనా కేసులు నమోదుకాగా 27 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 4,30,94,938కి పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 19,688గా ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 4,30,94,938
- మొత్తం మరణాలు: 5,24,002
- యాక్టివ్ కేసులు: 19,688
- మొత్తం రికవరీలు: 4,25,51,248
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.05గా ఉంది. కరోనా రికవరీ రేటు 98.74గా ఉంది.
కొవిడ్ డైలీ పాజిటివిటీ రేటు 0.76గా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 0.79గా ఉంది.
వ్యాక్సినేషన్
గురువారం ఒక్కరోజే 16,59,843 మందికి కరోనా టీకా అందించింది కేంద్రం. మొత్తంగా ఇప్పటివరకు 1,89,81,52,695 డోసుల టీకా పంపిణీ చేసింది. గురువారం 4,65,918 మందికి కరోనా పరీక్షలు చేపట్టింది. మొత్తం టెస్టుల సంఖ్య 83.97 కోట్లు దాటింది.
దిల్లీ, మహారాష్ట్రలలో
దిల్లీలో కొత్తగా 1,365 కరోనా కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 6.35%గా ఉంది.
మహారాష్ట్రలో కొత్తగా 233 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ 233 కేసుల్లో ఒక్క ముంబయిలోనే 130 కరోనా కేసులు వచ్చాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 1,109గా ఉంది.
Also Read: Prashant Kishor On Rahul Gandhi: రాహుల్ గాంధీతో ఎలాంటి పేచీ లేదు- ఆయనెక్కడ? నేనెక్కడ?: పీకే
Also Read: Amit Shah In Bengal: CAA అమలుపై అమిత్ షా క్లారిటీ- బంగాల్ సీఎం దీదీ కౌంటర్