ABP  WhatsApp

Amit Shah In Bengal: CAA అమలుపై అమిత్ షా క్లారిటీ- బంగాల్ సీఎం దీదీ కౌంటర్

ABP Desam Updated at: 05 May 2022 10:05 PM (IST)
Edited By: Murali Krishna

Amit Shah In Bengal: పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసి తీరతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు.

CAA అమలుపై అమిత్ షా క్లారిటీ- బంగాల్ సీఎం దీదీ కౌంటర్

NEXT PREV

Amit Shah In Bengal: పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏఏ అమల్లోకి రాబోదని తృణమూల్ కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని అమిత్ షా మండిపడ్డారు. కొవిడ్-19 మహమ్మారి ప్రభావం ముగిసిన వెంటనే ఈ చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తామని తేల్చిచెప్పారు. ఈ మేరకు గురువారం బంగాల్ సిలిగురిలో జరిగిన 'పశ్చిమ్ బంగో సమ్మాన్ సమావేశ్‌'లో ఆయన మాట్లాడారు.







మమతా బెనర్జీ చొరబాట్లను కోరుకుంటున్నారు. కానీ టీఎంసీ వాళ్లు ఒక్క విషయం జాగ్రత్తగా వినండి. సీఏఏ చట్టం అమల్లోకి రాకూడదని వాళ్లు కలలు కంటున్నారు. బంగాల్‌కు వచ్చిన శరణార్థులకు పౌరసత్వం రాకూడదని దీదీ కోరుకుంటున్నారు. కానీ కరోనా ప్రభావం ముగిసిన వెంటనే సీఏఏను అమలు చేసి తీరతాం.                                                           -     అమిత్ షా, కేంద్ర హోంమంత్రి


దీదీ కౌంటర్


అమిత్‌షా వ్యాఖ్యలకు బంగాల్ సీఎం మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. బంగాల్ గురించి అమిత్ షాకు ఎలాంటి బెంగా అవసరం లేదని దిల్లీ జ‌హంగీర్‌పురీ, యూపీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న వ్య‌వ‌హారాల‌పై ఆయన దృష్టి నిలిపాల‌ని హితవు పలికారు. 



మిస్టర్ అమిత్ షా.. మీరు హోం మంత్రి కాబట్టి నాకు గౌరవం ఉంది. నేను ఎలా నడచుకోవాలో మీరు చెప్పకండి. ఆవుల అక్రమ రవాణా, చొరబాట్లను నిరోధించవలసిన బాధ్యత మీది. సరిహద్దుల్లో శాంతిని కాపాడవలసిన కర్తవ్యం మీది. అది సరిగా చేయకుండా రాష్ట్రంలో విభజనలు సృష్టించాలని భాజపా ప్రయత్నిస్తోంది. కొవిడ్ త‌గ్గిన త‌ర్వాత సీఏఏను అమ‌లు చేస్తామ‌ని చెబుతోన్న అమిత్ షా ఇన్ని రోజులుగా గ‌డిచినా, ఇంకా పార్ల‌మెంట్‌లో ఎందుకు  ప్ర‌వేశ‌పెట్ట‌లేదు. ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను కాల‌రాయ‌డం నాకు ఇష్టం లేదు. అంద‌రూ క‌లిసి మెలిసి ఉండాల‌న్న‌దే నా అభిమతం.                                                        - మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి


Also Read: WHO on Covid Death: భారత్ లో కరోనా మరణాలు 47 లక్షలకు పైనే, డబ్ల్యూహెచ్ఓ నివేదికను తప్పుబట్టిన కేంద్రం


Also Read: Prashant Kishor Political Party: జగన్ బాటలో ప్రశాంత్ కిశోర్- 3వేల కిమీ పాదయాత్ర, ఆ తర్వాతే అన్నీ!

Published at: 05 May 2022 10:03 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.