ABP  WhatsApp

Prashant Kishor Political Party: జగన్ బాటలో ప్రశాంత్ కిశోర్- 3వేల కిమీ పాదయాత్ర, ఆ తర్వాతే అన్నీ!

ABP Desam Updated at: 05 May 2022 12:58 PM (IST)
Edited By: Murali Krishna

Prashant Kishor Political Party: బిహార్‌లో త్వరలోనే పాదయాత్ర ప్రారంభించనున్నట్లు ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు.

జగన్ బాటలో ప్రశాంత్ కిశోర్- 3వేల కిమీ పాదయాత్ర, ఆ తర్వాతే అన్నీ!

NEXT PREV

Prashant Kishor Political Party: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక ప్రకటన చేశారు. ఇప్పుడప్పుడే పార్టీ పెట్టే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. కానీ 3వేల కిమీ పాదయాత్ర చేస్తానని కిశోర్ వెల్లడించారు. ఈ మేరకు బిహార్‌ పట్నాలో మీడియా సమావేశంలో పీకే మాట్లాడారు.



సీఎం నితీశ్​ కుమార్​, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్​ యాదవ్​ నేతృత్వంలో బిహార్​కు ఒరిగిందేమీ లేదు. బిహార్ అభివృద్ధి చెందాలంటే సరికొత్త ఆలోచనలు కావాలి. రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలనుకునేవారు నాతో కలిసి ముందుకురావాలి. 90 శాతం మంది ప్రజలు బిహార్​లో మార్పు కోరుకుంటున్నారు. అందుకే పాదయాత్రలో వారిని కలుస్తాను.                                                               -  ప్రశాంత్ కిశోర్, ఎన్నికల వ్యూహకర్త


వాస్తవానికి ప్రశాంత్ కిశోర్ రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. వీటికి ఆయన సమాధానం ఇప్పుడప్పుడే పార్టీ లేదని స్పష్టం చేశారు. మహాత్మ గాంధీ జయంతి పురస్కరించుకుని అక్టోబర్ 2న బిహార్ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు పీకే పేర్కొన్నారు.


ఆ ట్వీట్‌తో


ప్రశాంత్ కిశోర్ ఇటీవల చేసిన ట్వీట్‌తో త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు సంకేతాలిచ్చారు.





ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన భాగస్వామిని అయి, ప్రజానుకూల విధానాల రూపకల్పనలో సాయం చేయడంలో పదేళ్లు గడిచాయి. ఇప్పుడు నేరుగా ప్రజల దగ్గరకు చేరువకావాల్సిన సమయం వచ్చింది. వారి సమస్యల్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకుని, జన సురాజ్​కు బాటలు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆరంభం బిహార్​ నుంచే.                                                     - ప్రశాంత్ కిశోర్, ఎన్నికల వ్యూహకర్త


Also Read: Covid Update: కరోనాతో ఒక్కరోజులో 55 మంది మృతి- కొత్తగా 3,275 కేసులు నమోదు


Also Read: Rakesh Biyani Resigns: ఫ్యూచర్ రిటైల్ ఎండీ రాకేశ్ బియానీ రాజీనామా

Published at: 05 May 2022 12:15 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.