Rakesh Biyani Resigns:
ఫ్యూచర్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) రాకేశ్ బియానీ తన పదవికి రాజీనామా చేశారు. పదవి నుంచి తప్పుకుంటున్నట్లు అనూహ్యంగా ప్రకటించారు. ఆయనతో పాటు సంస్థ సెక్రటరీ కూడా పదవికి రిజైన్ చేశారు. ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయిన ఫ్యూచర్ రిటైల్ కంపెనీకి ఇది మరో గట్టి షాక్ కానుంది.
సంక్షోభంలో
ఫ్యూచర్ రిటైల్ ఇప్పటికే రుణ సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ సంస్థపై బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) ఇటీవల దివాలా అస్త్రం ప్రయోగించింది. దివాలా చర్యలు ప్రారంభించాలని కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో పిటిషన్ దాఖలు చేసింది.
మరోవైపు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో కొనసాగుతున్న వ్యాజ్యాలు, ఇతర సమస్యల కారణంగా ఏప్రిల్ నెల ప్రారంభంలో ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్‌ఎల్‌ఆర్) తన రుణదాతలకు రూ. 5,322.32 కోట్లు చెల్లించడంలో విఫలమైంది. దీంతో దివాలా కోడ్, 2016లోని 7వ సెక్షన్ కింద రుణ దాతల కన్షార్షియంకు నేతృత్వం వహిస్తున్న బీవోఐ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. తాము పిటిషన్ కాపీని అందుకున్నానని, న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటామని ఫ్యూచర్ గ్రూప్ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
2020 ఆగస్టులో ఫ్యూచర్ గ్రూప్ ప్రకటించిన రూ.24,713 కోట్ల డీల్‌లో ఫ్యూచర్ రిటైల్ ఒక భాగం. ఈ డీల్‌లో భాగంగా రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 19 కంపెనీలను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌వీఎల్)కు విక్రయిస్తున్నట్లు గ్రూప్ ప్రకటించింది. ఈ ఒప్పంద ప్రతిపాదన ప్రకారం, 19 కంపెనీలు అన్నీ కలిసి ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ అనే ఒక్క ఒక్క కంపెనీగా విలీనమై తదుపరి ఆర్‌ఆర్‌వీఎల్‌లకు బదిలీ అవుతాయి.
Also Read: Covid Update: కరోనాతో ఒక్కరోజులో 55 మంది మృతి- కొత్తగా 3,275 కేసులు నమోదు