బిర్యాని తినడానికి హిమను పిలుస్తారు. డాక్టర్ సాబ్ వస్తున్నాడని తెలుసుకున్న జ్వాల.. తాను ఉన్నాననే నిరుపమ్ వస్తున్నట్టు ఊహించుకుంటుంది.
కార్తీక్, దీప ఫొటోతో తన బాధలను పంచుకుంటుంది సౌందర్య. స్వప్న, సత్యం పెళ్లి రోజు కూడా కలిసి ఉండరు కదా అని ఏడుస్తుంది. స్వప్న మాట వినడం లేదని... మారితే బాగుంటుందని అనుకుంటుంది. ఈ పెళ్లిరోజైనా కలిసి చేసుకుంటే బాగుంటుందని కన్నీరు పెట్టుకుంది. ఇంతలో హిమ వచ్చి తాను సత్యం మామయ్య ఇంటికి డిన్నర్ వెళ్తున్నాని చెప్పి వెళ్లిపోతుంది. విడిపోయిన సౌర్య ఎప్పుడు కలుస్తుందో... దూరంగా ఉన్న సత్యం, స్వప్న ఎప్పుడు ఒక్కటవుతారో అని ఆలోచించుకుంటుంది సౌందర్య.
బిర్యాని తింటూ ఇక్కడ అంతా ఆనందంగా ఉంటారు. బిర్యాని బాగుందని నిరుపమ్ కాంప్లిమెంట్ ఇస్తాడు. హిమ కూడా కాంప్లిమెంట్ చేస్తుంది. ఇలా మన అందరం కలిసి తిన్నట్టే మమ్మీడాడీ కలిస్తే బాగున్ను అనుకుంటాడు నిరుపమ్. ఇంతలో సత్యం బయటకు వస్తాడు. ఆయన ప్రవర్తనలో తేడాను గమనిస్తూ తాగారా అని అంతా అడుగుతారు. తాగుడుపై కాసేపు డిస్కషన్ నడుస్తుంది. మమ్మీడాడీ పెళ్లి రోజు సంగతి అందరితో చర్చించాలని అనుకుంటాడు నిరుపమ్. ఇంతలో నిరుపమ్‌తో పెళ్లి అయినట్టు ఊహించుకొని మొత్తం బిర్యాని ఆయనకే పట్టేస్తుంది జ్వాల. ఎవరు ఎంత పిలిచినా పట్టించుకోకుండా వడ్డించేస్తుంది. మ్యారేజ్ యానివర్సరీ గురించి నిరుపమ్ ప్రస్తావిస్తాడు. వాళ్లిద్దరు కలిస్తే అందరం ప్రశాంతంగా ఉంటామని ప్రపోజల్ పెడతాడు.
సౌందర్య వద్ద పెళ్లి రోజు సంగతిని ప్రస్తావిస్తారు. ఒప్పుకోదు కదా అని అనుమానం వ్యక్తం చేస్తుంది సౌందర్య. నిరుపమ్ ఒప్పిస్తాడని అనుకుంటారు.
సీన్ కట్ చేస్తే... చిత్తు కాగితాలు తీసుకెళ్లడానికి జ్వాల వస్తుంది. అక్కడే అప్పట్లో ఆర్టిస్ట్ గీత వేసిన పేపర్స్ పడి ఉంటాయి. జ్వాల, హిమ బొమ్మలు ఉంటాయి. ఇంతలో అక్కడికి సౌందర్య కారు ఆగి ఉంటుంది. ఇంతలో ఆటో నుంచి డబ్బులను ఓ వ్యక్తి కొట్టేస్తుంటే సౌందర్య పట్టుకుంటుంది. ఆ దొంగ సారీ అక్క అంటే చెంప వాయిస్తుంది. వాడికి డబ్బులు ఇచ్చి పంపేస్తుంది. సీన్ కట్ చేస్తే నిరుపమ్ తన తల్లికి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్తాడు. పంక్షన్ కోసం చెప్తే కోపంతో రగిలిపోతుంది. మీ అమ్మమ్మ, నాన్న లేకుంటే పంక్షన్‌లో బాగుంటుందని అంటుంది.
రేపటి ఎపిసోడ్
అక్కడే ఉన్న జ్వాల...మ్యారేజ్ డేను బస్తీలో చేస్తానని స్వప్నను రెచ్చగొడుతుంది. అంతే.. రెచ్చిపోయిన స్వప్న తమ మ్యారేజ్‌డేను నిరుపమ్ చేస్తాడని చెప్పి వెళ్లిపోతుంది. అంతా కలిసి జ్వాలకు థాంక్స్ చెప్తారు.