International Passengers:
బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో..
తమిళనాడు, కేరళ తరవాత బెంగళూరులోనూ కరోనా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. అబుదాబి, హాంగ్‌కాంగ్, దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లో కొవిడ్ టెస్ట్ చేయగా...పాజిటివ్ వచ్చింది. ఈ ముగ్గురి వైరస్ శాంపిల్స్‌ని జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్‌కు పంపారు. పాజిటివ్‌గా తేలిన వెంటనే ముగ్గురు బాధితులను సమీపంలోని కొవిడ్ ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం కరోనా కట్టడికి మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో భాగంగా బెంగళూరు, మంగళూరు విమానాశ్రయాల్లో విదేశీ ప్రయాణికులకు కరోనా పరీక్షలు కొనసాగుతున్నాయి. కరోనా లక్షణాలు కనిపించిన వారిని దగ్గర్లోని ఆసుపత్రుల్లో క్వారంటైన్ చేస్తున్నారు. అక్కడే చికిత్స
అందిస్తున్నారు. స్కూల్స్, కాలేజీలు, థియేటర్లు, రెస్టారెంట్‌లు, పబ్‌ల, బార్‌లలో మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరు విమానాశ్రయంలో ఇప్పటి వరకూ 19 మంది విదేశీ ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలిందని కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.
ఢిల్లీలోనూ..
పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం అన్ని విమానాశ్రయాల సిబ్బందిని అప్రమత్తం చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా RT PCR టెస్ట్‌లు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఎవరిలో కరోనా లక్షణాలు కనిపించినా వెంటనే క్వారంటైన్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో టెస్ట్‌లు భారీ సంఖ్యలో చేస్తున్నారు. ఈ క్రమంలోనే 13 మంది విదేశీ ప్రయాణికులకు కరోనా సోకిందేమోనన్న అనుమానంతో నేరుగా ఎయిర్‌పోర్ట్ నుంచి ఆసుపత్రికి తరలించారు. వారికి కరోనా సోకిందేమో అన్న అనుమానం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో వాళ్లకు చికిత్స అందిస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ చేసిన వెంటనే వాళ్ల వైరస్ శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఈ 13 మంది ప్రయాణికులు రకరకాల దేశాల నుంచి
వచ్చిన వాళ్లు. వీళ్లను అసింప్టమేటిక్‌గా అనుమానిస్తున్నారు అధికారులు. ఈ ఎయిర్‌పోర్ట్‌లో ఎవరినీ వదలకుండా నిత్యం టెస్ట్‌లు చేస్తూనే ఉన్నారు. తమిళనాడులో కరోనా కలకలం రేపింది. చైనా నుంచి కొలంబో మీదుగా తిరిగి వచ్చిన ఒక మహిళ,ఆమె ఆరేళ్ల కుమార్తెకు కరోనా పాజిటివ్ వచ్చింది. తమిళనాడులోని మధురై విమానాశ్రయంలో వీళ్లకు కొవిడ్-19 పరీక్ష చేశారు. మధురై సమీపంలోని విరుదునగర్‌కు చెందిన మహిళ, ఆమె కుమార్తెకు మంగళవారం ల్యాండ్ అయినప్పుడు విమానాశ్రయంలో RT-PCR పరీక్షను నిర్వహించారు. ఫలితాల్లో కరోనాకు పాజిటివ్‌గా తేలినట్లు అధికారి తెలిపారు. వీరిద్దరూ విరుదునగర్‌లో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జినోమిక్ సీక్వెన్సింగ్ కోసం వారి నమూనాలను ల్యాబ్‌కు పంపనున్నారు.
Also Read: NIA Raids: కేరళలోని 56 ప్రదేశాల్లో NIA దాడులు- అల్‌ఖైదాతో టచ్‌లో పీఎఫ్ఐ!