Karthika Deepam  December 29th  Episode 1549(కార్తీకదీపం డిసెంబరు 29ఎపిసోడ్)


సౌందర్య, ఇంద్రుడి పై సీరియస్ అవుతూ నీకు అంతా తెలుసు ఎందుకు వాళ్ల గురించి నీకు అంత తెలిసి కూడా చెప్పు ఎందుకు దాస్తున్నావు అని నిలదీస్తుంది
ఇంద్రుడు: ఏమని చెప్పమంటారమ్మా మీరు కాలర్ పట్టుకున్నారు అని చనిపోయిన వాళ్ళని బతికున్నారని చెప్పమంటారా 
సౌందర్య: చనిపోవడం ఏంట్రా వాళ్ళు బతికే ఉన్నారు. శౌర్య చెబుతుంటే అబద్ధం అనుకున్నాను కానీ హిమ కూడా చూసింది నా కొడుకు బతికున్నాడు అన్నది నిజం . నీకు దండం పెడతాను ప్లీజ్ రా నా కొడుకు వాళ్ళు బతికే ఉన్నారా లేదా చెప్పు 
ఇంద్రుడు: అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు. 


Also Read: నీ భర్తని అని అందరికీ పరిచయం చేయమన్న రిషి , ఎంట్రీ ఇచ్చిన రాజీవ్


మరోవైపు దీప హాస్పిటల్లో చారుశీల కార్తీక్ ఇద్దరు మాట్లాడుకున్న మాటలు అన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. నేను చనిపోతే డాక్టర్ బాబు ఒంటరి అయితారు నేను చనిపోయాను అన్న మాట చెప్పలేక డాక్టర్ బాబు ఎక్కడికి వెళ్లి పోతాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి హేమచంద్ర వచ్చి దీప ఆరోగ్యం గురించి అడుగుతాడు. అంతా బాగానే ఉందని దీప అబద్ధాలు చెప్పి కవర్ చేస్తుంది. 
హేమచంద్ర: ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు 
దీప: జరిగింది మొత్తం వివరించడంతో హేమచంద్ర పండరి ఇద్దరు షాక్ అవుతారు. నేనింకా ఎంతో కాలం బతకను అన్నయ్య అనడంతో హేమచంద్ర బాధపడతాడు.
పండరి:  దీప ఏడుస్తూ మాట్లాడడంతో పండరి కూడా ఎమోషనల్ అవుతుంది. 
దీప: అన్నయ్య మా ఫ్యామిలీని కూడా కలుసుకోకుండా ఇలాగే ఉండిపోయాం 
హేమచంద్ర: ఏంటమ్మా నీ పరిస్థితి అని హేమచంద్ర బాధపడుతూ ఉంటాడు. పిల్లలకు బతికే ఉన్నారని తెలియజేయండి. ఇలాంటి సమయంలోనే ఫ్యామిలీకి దగ్గరగా ఉండాలి
దీప: ఇన్నాళ్లు చనిపోయాము అనుకున్న వాళ్లు ఇప్పుడు బతికే ఉన్నాం అని తెలిసి మళ్ళీ కొద్ది రోజులకు చనిపోతామని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు 
అప్పుడు హేమచంద్ర నేను కార్తీక్ తో మాట్లాడుతాను అనడంతో వద్దన్నయ్య నాకు నిజం తెలుసని చెప్పొద్దు ఆయన బాధపడతారు అంటుంది. ఇప్పుడు నేను భయపడుతున్నారు నేను లేకపోతే డాక్టర్ బాబు ఏమైపోతారు అన్నది నా భయమని దీప  బాధపడుతూ ఉంటుంది.


Also Read: కార్తీక్ ను దూరం చేసుకునేందుకు సిద్ధపడిన దీప, ఇంద్రుడి కాలర్ పట్టుకున్న సౌందర్య!


శౌర్య..తమ ఇంటి ఎదురుగా ఉన్న ఇంటికెళ్లి పూలు కోసుకోవాలి అనుకుంటుంది. ఇక్కడ ఎవరూ లేరని అనుకుంటుండగా హేమచంద్ర అక్కడకు వస్తాడు. ఎవరమ్మా నువ్వు అన్నడంతో ఎదురింటిలో కొత్తగా దిగాం నాకు పూలు కావాలి అని అంటూ సరే కోసుకో అంటాడు హేమచంద్ర. అప్పుడు శౌర్య తన తండ్రి కూడా డాక్టర్ అని చెప్పడంతో హేమచంద్ర షాక్ అవుతాడు. తల్లిపేరు అడిగుతాడు...శౌర్య చెప్పేలోగా చంద్రమ్మ అక్కడకు వచ్చి శౌర్యను తీసుకెళ్లిపోతుంది. హేమచంద్రకు డౌట్ వస్తుంది కానీ కార్తీక్-దీప పిల్లల్ని కలవొద్దు అనుకున్నారని గుర్తుచేసుకుని ఆగిపోతాడు..


జరిగినదంతా తెలుసుకుని దీప బాధపడుతుంటే..కార్తీక్ వచ్చి ..నువ్వు పనులు చేయొద్దని చెప్పానుకదా అని అంటాడు. అప్పుడు చారుశీల మనసులో అనుకుంటుంది..ఇదే మంచి అవకాశం...దీపను నా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి రేపు దీప చనిపోయిన తర్వాత కార్తీక్ కు నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటూ ఉంటుంది. అలా చేసుకుంటే కార్తీక్ ఆస్తి మొత్తం నాదే అవుతుంది అనుకుంటుంది. 


సౌందర్య జరిగిన విషయాల గురించి తలుచుకుని బాధపడుతూ ఉండగా ఇంతలో ఆనందరావు అక్కడికి వస్తాడు.
ఆనందరావు: ఏదో అడుగుతానని చెప్పి ఇంద్రుడిని తీసుకెళ్లావు కదా ఏమైనా చెప్పాడా 
సౌందర్య: వాడికేం తెలియదు అంటున్నాడు 
ఆనందరావు: తెలియదేమో
సౌందర్య: వాడి మాటలు తడబాటును బట్టి చూస్తే కచ్చితంగా తెలుసు కానీ నా దగ్గర నిజం దాస్తున్నాడు . ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాలేదు. 
ఇంతలో శౌర్య వస్తుంది..ఎక్కడికి వెళ్లావని సౌందర్య అడిగితే..ఎదురింటికి పూలు కోసుకునేందుకు వెళ్లాను..ఆయన కూడా డాక్టరే అనిచెబుతుంది. అవునా నేను మాట్లాడతాను..మన కొడుకు,కోడలి గురించి ఏమైనా తెలుస్తుందేమో...


మరోవైపు హాస్పిటల్లో కార్తీక్, చారుశీల దీప ని చెక్ చేస్తూ దీప గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు దీప నాకు కాకుండా మీకు చెకప్ చేయించుకోవచ్చు కదా మీకే కదా హెల్త్ ప్రాబ్లం అనడంతో నేను ప్రతిరోజు చేయించుకుంటూనే ఉన్నాను అని అబద్ధం చెబుతాడు కార్తీక్.


రేపటి(శుక్రవారం) ఎపిసోడ్ లో 
సౌందర్య, ఆనందరావు,పిల్లల్ని చూసి దీప బాధపడుతుంది. మన బతుకు ఇలా ఉందంటని బాధపడుతుంది దీప. మీరు నన్ను వదిలేసి అత్తయ్య వాళ్ల దగ్గరకి వెళ్లిపోండిఅంటుంది... నా ప్రాణాలు పోతాయని మీరు అబద్ధం చెప్పారని నాకు తెలుసు.. అత్తయ్య వాళ్లు వెళ్లిపోతున్నారు వెళ్లండి అని అంటుంది..దీప మాటలు విని కార్తీక్ షాక్ అవుతాడు...