గుప్పెడంత మనసు డిసెంబరు 28 ఎపిసోడ్ ( Guppedantha Manasu December 28th Update Today Episode 645)
తండ్రితో వాదనకు దిగుతుంది వసుధార. తండ్రి చక్రపాణికి ఎంత నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా..నువ్వు పెళ్లిపీటలపై నుంచి పారిపోయావో, లేచిపోయావో అని నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. తప్పు మీ ఆలోచనా విధానంలో ఉందని వసుధార అనడంతో.. నా పరువు పోయిందని ఫైర్ అవుతాడు.
చక్రపాణి: నువ్వెళ్లావ్..అక్కడఏం చేశావో ఎం చదివావో నాకు తెలుసా..కానీ దార్లో ఎదురుపడే ప్రతివెధవా నీ గురించే నన్ను అడుగుతున్నారు..ఈ విషయం నీకు తెలుసా..అల్లుడుగారు దేవుడు కాబట్టి తన వల్లే ఈ సంసారం నడుస్తోంది. నీ గురించి అడుగుతుంటే చెప్పలేక మా అక్కయ్య తీర్థయాత్రకు వెళ్లింది. చిన్నోడిని హాస్టల్లో చేర్పించా. చిన్న అల్లుడి దగ్గరైనా ఉన్నావా అంటే వాళ్ల మధ్య కూడా ఏదో గొడవ పెట్టావు
వసు: నాన్న అలా మాట్లాడాతారేంటి
చక్రపాణి: నా అల్లుళ్లు దేవుళ్లు
సుమిత్ర: మరి కూతురి సంగతి ఏంటి... దానికి ఇష్టంలేని సంబంధం చేసేందుకు ప్రయత్నించింది మీరు
చక్రపాణి: నన్ను గౌరవించేది అర్థం చేసుకునేది మా అల్లుళ్లు మాత్రమే
వసు: వాళ్ల నిజస్వరూపం మీకు తెలియదు..వాళ్లు అన్నమాటలు, చేసిన పనులు చెబితే మీరే వాళ్లని చెప్పుతో కొడతారు
చక్రపాణి చేయి ఎత్తడంతో..సుమిత్ర అడ్డుకుంటుంది..
వసు: ఏంటి కొడతారా కొట్టండి.. మీ ఇద్దరు అళ్లుళ్లు ఒక్కటే అంటూ మొదలుపెడుతుంది..
Also Read: కార్తీక్ ను దూరం చేసుకునేందుకు సిద్ధపడిన దీప, ఇంద్రుడి కాలర్ పట్టుకున్న సౌందర్య!
అదే సమయానికి రిషి ఇంటి ముందు కారు ఆపి హారన్ కొడతాడు... రిషి సార్ వచ్చారని చెప్పి బయటకు వెళుతుంది.
చక్రపాణి: వాడెవడు..
వసు: మర్యాదగా మాట్లాడండి..ఆయన మా సార్
చక్రపాణి: మరి ఇంటికెందుకు వచ్చాడు..ఇంటిముందుకొచ్చి కారు హారన్ కొట్టడం ఏంటి..
వసు:నేను వెళతాను..వచ్చాక అన్నీ చెబుతాను..
చక్రపాణి అరుస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోతుంది వసుధార...
చక్రపాణి: ఇంట్లో ఏం జరుగుతోంది..
సుమిత్ర: దాన్ని ఏమీ అనొద్దు..మళ్లీ వెళ్లిపోతే ఇంటికి రాదు..లోపలకు వచ్చాక నేను అడిగి తెలుసుకుంటాను మీరు బయటకు వెళ్లి అల్లరి చేయొద్దని సుమిత్ర బతిమలాడుతుంది
చక్రపాణి: రానీ దాని సంగతి చెబుతాను అంటాడు
Also Read: శాడిస్ట్ తండ్రి, సైకో బావ మధ్యలో వసుధార, రిషి ఏం చేయబోతున్నాడు!
వసుధార రిషి దగ్గరకు వెళుతుంది
వసు: ఇక్కడికి ఎందుకు వచ్చారు సరే ముందు ఇక్కడి నుంచి మనం వెళ్దాం పదండి అని రిషి ని ఒక చోటికి తీసుకుని వెళుతుంది.
రిషి: ఏదో జరిగింది నువ్వు ఏదో నా దగ్గర దాస్తున్నావు
ఆ తర్వాత వసుధార, రిషి ఇద్దరూ ఒక చోట కూరుచొని ఉంటారు
రిషి: మీ ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా
వసు: లేదు సార్
రిషి: మరి ఎందుకు అలా ఉన్నావ్ నేను మీ ఇంటికి దగ్గరలోకి వస్తే ఎందుకు వచ్చారు సార్ అని అడిగావు ఏంటి వసు. నువ్వు లేకపోతే నాకు ఎలాగో ఉంటుంది. నువ్వు ఎప్పటిలాగే గలాగలా మాట్లాడాలి ఇలా మౌనంగా ఉండకూడదు అని అంటాడు. ఈ ఊరి గురించి మొత్తం అన్ని చెబుతావు అనుకుంటే ఇలా మాట్లాడుతున్నావేంటి. నువ్వు చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలన్ని చూసి మీ చిన్నప్పటి స్నేహితులను కలిసి ఇదిగో ఇతనే నా భర్త అని గర్వంగా పరిచయం చేస్తావని అనుకున్నాను. నువ్వు ఈ ఊరికి వచ్చినా కొత్తలో ఎంత సంతోషంగా మాట్లాడావు కానీ ఇప్పుడు ఇలా ఉన్నావు అసలు నాతో వచ్చిన వసుధార నువ్వేనా అన్న అనుమానం వస్తోంది
వసుధార: రిషి చేయి పట్టుకుని ఎమోషనల్ అవుతుండగా ఎందుకు ఏడుస్తున్నావు వసుధార ఏమయింది అని అడుగుతాడు రిషి వీ కన్నీళ్లు కాదు సార్ మిమ్మల్ని నాకు ఇచ్చినందుకు మీ ప్రేమ పొందినందుకు వస్తున్నందుకు ఆనంద భాష్పాలు అని అంటుంది.
రిషి: నేను అన్ని సార్లు కాల్ చేశాను నేను నువ్వు ఒక్కసారి కూడా కాల్ చేయలేదు నీ మొబైల్ ఏది ఇలా ఇవ్వు అనడంతో ఒకసారి టెన్షన్ పడుతూ ఉంటుంది.
వసుధార: ఫోన్ కింద పడి పగిలిపోయింది సార్.
రిషి: ఆ ఫోన్ సంగతి వదిలేసేయ్ నేను కొత్త ఫోన్ కొనిస్తాను. నా ఫోన్ కోసం ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడే ఫోన్ చేసి అందర్నీ రమ్మని చెబుతాను ఇప్పటికే చాలా ఆలస్యం అయింది అని అంటాడు.
వసు: వద్దు అని అంటుంది. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చావు ఇంట్లో అందరూ బాగున్నారా అని అడగగా బాగున్నారు అని అంటుంది వసు.
మరోవైపు రాజీవ్...వసుధార ఇంటికి వెళ్తూ ఉండగా అప్పుడు వసుని చూసి కారు ఆపుతాడు. రిషిధారని చూసికోపంతో రగిలిపోతాడు. మరోవైపు జగతి, మహేంద్ర ఇద్దరు రిషి వాళ్ల గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు.