గుప్పెడంత మనసు డిసెంబరు 27 ఎపిసోడ్  ( Guppedantha Manasu  December 27th Update Today Episode 644)


రిషితో మాట్లాడిన తర్వాత బాధగా కూర్చుంటుంది వసుధార. తల్లి వచ్చి బతిమలాడి పరువు, పేద, గొప్ప అంటూ ఏవేవో చెబుతూ భోజనం తినిపిస్తుంటుంది. ఎంత కాదనుకున్న ఆయన మీ నాన్నే కదా నీకు ఒక విషయం తెలుసా అందరికి నువ్వంటేనే ఎక్కువ ఇష్టమనడంతో నిజమా అమ్మ అని అడుగుతుంది వసు.  ఇంతలో ఎంట్రీ ఇచ్చిన తండ్రి చక్రపాణి..అన్నం తినే కంచం లాక్కుంటాడు. అదేదో పనిమీద వచ్చింది పని అయిపోగానే వెళ్ళిపోతుంది అప్పుడు మనిద్దరమే ఉంటాము అని అంటాడు చక్రపాణి. చూసావా ఇంటికి వచ్చిందో లేదో ఫోన్ల మీద ఫోన్లో వస్తున్నాయి ఈ నెలలో నీకు ఒక్కసారైనా ఫోన్ చేసిందా అని అంటూ కోపంగా ఫోన్ విసిరికొడతాడు. అదే సమయానికి జగతి కాల్ చేయడంతో స్విచ్ ఆఫ్ వస్తుంది. జగతి టెన్షన్ పడుతుంది. నువ్వు ఏం బాధపడకు జగతి చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్ళింది కదా చెబుతాడు మహేంద్ర. రిషికి కాల్ చేయమని జగతి చెబుతుంది. 


Also Read: మోనిత, చారుశీల ప్లాన్ సక్సెస్ - దీపకు గుండెపోటు, హిమ మాటనమ్మని శౌర్య!


మరోవైపు రిషి..వసుధార ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అసలు అక్కడ ఏం జరుగుతోంది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నాకు తిరిగి కాల్ చేయడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. చార్జింగ్ అయిపోయి ఉంటుంది తనే చేస్తుందిలే అనుకుంటాడు. ఇంతలో దేవయాని ఫోన్ చేయడంతో చెప్పు వసుధార అనగా నేను మీ పెద్దమ్మని అని అంటుంది దేవయాని. అప్పుడు అక్కడ పరిస్థితులన్నీ తెలుసుకుని దేవయాని నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత దేవయాని, రాజీవ్ కి ఫోన్ చేస్తుంది. నువ్వు రంగంలోకి దిగాల్సిన సమయం ఆసన్నమైంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పినట్టు చెయ్యి అని అంటుంది దేవయాని. అప్పుడు దేవయాని ఫోన్ కట్ చేసి నేను ఉండగా వసు రిషిని పెళ్లి చేసుకుంటుందా అది నేనుండగా ఎప్పటికీ జరగదు అని అనుకుంటూ ఉంటుంది. 


రిషి వసుధార చదువుకున్న కాలేజీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వసుధార కాలేజీ లోపలికి వెళ్లినట్టు ఊహించుకుని లోపలికి వెళ్లి చూడగా అక్కడికి ఎవరూ లేకపోవడంతో అదంతా తన భ్రమ అనుకుంటాడు రిషి. మొదటిసారి ఇదే కాలేజీలో ఒకరికి తెలియకుండా ఒకరం నేను వసుధార కలుసుకున్నాం ఎంత మంచి జ్ఞాపకమో. వసుధార నా జీవితంలోకి రాకపోయుంటే నేను ఎన్నో కోల్పోయే వాడిని అనుకుంటూ ఉంటాడు రిషి. మరొకవైపు వసుధార ఫోన్ చూసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు చక్రపాణి బయటకు వెళ్తుండగా సుమిత్ర వెళ్లి కాఫీ ఇవ్వడంతో నాకొద్దు అని అంటాడు చక్రపాణి. వసుధారతో మాట్లాడండి అని సుమిత్ర చెప్పినా చక్రపాణి పట్టించుకోడు. 


Also Read: వసుని ఇంట్లోంచి పొమ్మన్న తండ్రి చక్రపాణి, రిషికి అబద్ధాలు చెప్పిన వసుధార


 రిషి వసుధారకి ఫోన్ చేస్తుండగా స్విచ్ ఆఫ్ రావడంతో టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇలా కరెక్ట్ కాదు డైరెక్ట్ గా వసుధార వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని బయలుదేరుతాడు.అదే సమయంలో వసుధార..తండ్రితో మాట్లాడుతుంటుంది. నాకు అహంకారం లేదు చదువుకోవాలి అనుకున్న నాకు పెళ్లి చేయాలి అనుకున్నారు. మాట్లాడుతుండగా చక్రపాణి దీర్ఘాలు తీసి వసుధార ని అపార్థం చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు వసుధార నీ కూతురు యూనివర్సిటీ టాఫర్ వచ్చిందని గర్వంగా చెప్పుకోండి అనడంతో.. పరువు పోయింది అని అంటాడు చక్రపాణి.