గుప్పెడంత మనసు డిసెంబరు 26 ఎపిసోడ్  ( Guppedantha Manasu  December 26th Update Today Episode 643)


కొన్నేళ్లతర్వాత ఇంటికి చేరుకున్న వసుధార...చక్రపాణి దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవడానికి వెళ్లగా ఎందుకొచ్చావు అని అంటాడు.  నేను యూనివర్సిటీ టాపర్ గా నిలాచనన్న మాటవిని తల్లి సుమిత్ర సంతోషపడుతుంది. 
సుమిత్ర: ఏవండీ ఏం మాట్లాడుతున్నారు అమ్మాయి రాకరాక ఇంటికి వస్తే ఇలాగేనా మాట్లాడేది 
చక్రపాణి: నాన్న  అని ఎలా పిలుస్తున్నావు. నిన్ను కన్న పాపానికి ప్రతిరోజు తల వంచుకుని వీధిలో నడుస్తున్నాను. పలానా చక్రపాణి కూతురు పెళ్లి పీట నుంచి లేచిపోయింది అని ప్రతి ఒక్కరు అంటుంటే ప్రాణాలు పోయేలా ఉండేవి
వసు: నాన్న నేను గొప్పగా పాసయ్యాను, మంచి పేరు తెచ్చుకున్నాను
చక్రపాణి: ఎవరికి కావాలి నీ గొప్ప . పెళ్లి పీటల నుంచి ఎప్పుడైతే లేచిపోయావో అప్పుడే మీ నాన్న చక్రపాణి చచ్చిపోయాడు అని అంటాడు. నువ్వు కూడా ఎక్కడో ఒక చోట చచ్చిపోయావు అనుకుని బ్రతుకుతున్నాను 
వసు: నాన్న నామీద ఎందుకు ఇంత కోపం అనడంతో చేసిందంతా చేసి నా మీద ఎందుకు కోపం అంటున్నావా ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటాడు.
సుమిత్ర: ఏవండీ ఏంటండీ ఇది అని సుమిత్ర అనడంతో నువ్వు మాట్లాడకు కోపం వస్తే నేను మనిషిని కాదు అన్న విషయం నీకు తెలుసు కదా. ఊర్లో వాళ్లకు మాట్లాడుకోవడానికి ఇంకొక టాపిక్ దొరికింది ఇన్నాళ్లకు చక్రపాణి కూతురు వచ్చింది ఎక్కడ ఉందో ఏం చేసిందో అని మాట్లాడుకుంటూ ఉంటారు అని బాధగా మాట్లాడతాడు. ఆడపిల్ల తండ్రిగా పుడితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది అని కోపంగా మాట్లాడుతాడు చక్రపాణి. 
వసు: తండ్రి కాళ్లపై పడి...నేను బాగా చదువుకున్నాను నాన్న 
కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు..


Also Read: కార్తీక్-దీపను చూసేసిన హిమ, మోనిత కళ్లలో ఆనందం కోసం చారుశీల అరాచకం


రిషి హోటల్లో రూమ్ తీసుకుంటాడు. నీ మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నానని వసుకి మెసేజ్ చేస్తాడు. మరొకవైపు వసుధార తల్లి సుమిత్ర ఒడిలో తల పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. నేను అక్కడికి వెళ్లినా కూడా మీ గురించే ఆలోచిస్తూ బాధపడ్డాను అమ్మ అనడంతో మళ్ళీ ఒక్కసారి అయినా ఫోన్ చేయలేదు కదా వసు
వసు: ఫోన్ చేసినట్టు తెలిస్తే మళ్లీ నాన్న నీపై ఎక్కడ కోప్పడతాడని  చేయలేదు . అమ్మ నేను ఏ లక్ష్యంతో అయితే వెళ్లానో అది సాధించాను యూనివర్సిటీ టాపర్ గా నిలిచాను అనడంతో సుమిత్ర సంతోషపడుతుంది. ఇంట్లో వాళ్ల గురించి అడగుతుంది
సుమిత్ర: ఏం చెప్పాలి మనకు ఆ బాధలు ఎప్పటికీ తప్పవు అందరూ తలా ఒక దిక్కు విడిపోయారు మీ అక్క మాధవికి ఇంకా కష్టాలు తప్పలేదు అని బాధపడుతుంది.
వసు: అమ్మ నువ్వేం బాధపడకు నేను వచ్చాను కదా ఒక్కొక్కటి సాల్వ్ చేస్తాను అని ధైర్యం చెబుతుంది . అన్ని బాగుంటే మన పెద్దక్క కొడుకుని మన దగ్గర పెంచుకుందాము అని సంతోషంగా మాట్లాడుతుంది వసుధార. యూనివర్సిటీ టాపర్ అయినందుకు కప్పు చూపిస్తూ ఉండగా ఇంతలో చక్రపాణి అక్కడికి వచ్చి ఆ కప్పును విసిరి కొడతాడు. 
చక్రపాణి: ఏం గొప్పగా చేశావని గొప్పగా చెప్పుకుంటున్నావు వీధుల్లో నడుచుకుంటూ వెళ్తే ముఖం మీద ఉమ్మేస్తున్నారు. ఆడపిల్లకు పెళ్లి చేయడం చేతకాదని మాట్లాడుకుంటున్నారు అని అంటాడు.
అప్పుడు వసుధర ఫోన్ రింగ్ అవుతుంది...నువ్వు గెలిచిన గెలుపు పోయిన పరువు తీసుకువస్తుందా నువ్వు చేసిన పనికి మెడ పైకెత్తుకోలేక తల దించుకుని వెళ్తున్నాను అని అంటాడు చక్రపాణి. రిషి ఎన్నిసార్లు ఫోన్ చేసినా వసుధార ఫోన్ లిఫ్ట్ చేయకుండా వాళ్ళ నాన్నతో పోట్లాడుతూ ఉంటుంది. నేను అన్న మాటలు ఇంకా ఎవరినైనా అని ఉంటే విషయం తాగి చచ్చేవాళ్లు నువ్వు అలాగే ఉన్నావు అని అంటాడు చక్రపాణి. సుమిత్ర ఏం మాట్లాడకుండా కుమిలిపోతూ ఉంటుంది. సుమిత్ర దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పు ఇక్కడే ఉంటే మళ్ళీ నా పరువు తీస్తుంది అని అంటాడు. ఇది నా కడుపున ఎందుకు పుట్టిందో పుట్టినప్పుడే చచ్చిపోయి ఉంటే బాగుండేది అని అంటాడు చక్రపాణి.


Also Read: నీ దూరం భరించలేనంటూ వసుని పుట్టింటికి సాగనంపిన రిషి, దేవయానికి ఇచ్చిపడేసిన జగతి
వసుధార-రిషి: వసుధారకి  ఏమైంది ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలోనే వసుధార అక్కడికి వచ్చినట్టు ఊహించుకుంటాడు. ఇంట్లో జరిగిన విషయాలు తలుచుకుని వసుధార కుమిలిపోతుంది. ఇంతలో రిషి కాల్ చేస్తాడు... కాల్ చేస్తాను అన్నావు నేను ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు ఏమైంది అని అడుగుతాడు రిషి. అక్కడ అంతా ఓకే కదా ఏం ప్రాబ్లం లేదు కదా అనడంతో వసుధార అబద్ధాలు చెబుతూ అంతా ఒకే సార్ ఇది మా ఇల్లే కదా..ఏం ప్రాబ్లెం ఉంటుందని కవర్ చేస్తుంది. 
నీ వాయిస్ లో ఎందుకో తేడాగా ఉంది నిజం చెప్పు వసుధార. నువ్వు ఏదో విషయం గురించి బాధపడుతున్నావు కదా అని రిషి అనడంతో... ఏం లేదు సార్ అని అబద్ధాలు చెప్పి కవర్ చేస్తుంది వసుధార. రిషి ఫోన్ మాట్లాడుతుండగా అమ్మ వస్తున్నాను అని అబద్ధాలు చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. సారీ సార్ నన్ను క్షమించండి..అనుకుంటుంది..