గుప్పెడంత మనసు డిసెంబరు 24 ఎపిసోడ్  ( Guppedantha Manasu  December 24th Update Today Episode 642)


వసుధార చదువుకున్న కాలేజీలో రిషిధారలు చక్కర్లు కొడతారు. ఆ తర్వాత జగతి ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ వసుధాకి ఇస్తాడు. ఏం పంపించారు మేడం అని వసుధార బాక్స్ తెరుస్తూ ఉండగా ఇంతలో రిషికి మహేంద్ర ఫోన్ చేస్తాడు. జాగ్రత్త అని మహేంద్ర చెబితే.. పెద్దమ్మని కంగారుపడొద్దని చెబుతాడు. నేను కాల్ చేయగానే మీరు ఇక్కడికి రావడానికి రెడీగా ఉండండి అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. కాలేజీ నుంచి బయలుదేరిన తర్వాత ఇంటికి కొంచెం దూరంలోనే కారు ఆపేయమంటుంది
వసుధార: మీరు ఇప్పుడే అక్కడివరకూ రావొద్దు... ఇన్నాళ్లూ ఇంటికి దూరమయ్యాను వాళ్లుకోపంగా ఉంటారు...అరుస్తారేమో...అక్కడ మీరు కనిపిస్తే నా ముందు మిమ్మల్ని ఏదైనా అంటే నేను తట్టుకోలేను సార్ ... చివరికి నా కన్న వాళ్ళు అయినా సరే నేను మిమ్మల్ని ఒక్క మాట కూడా అననివ్వను అని అంటుంది వసుధార. జగతి మాటలు గుర్తుచేసుకుని రిషి సరే అంటాడు... నేను కాల్  చేశాకే మీరు వద్దురుగాని అంటుంది
రిషి: నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను లేట్ చేయకు వసుధారా. మన మధ్య దూరం నేను భరించలేనని బాధగా మాట్లాడుతాడు
వసుధార: నా ప్రాణాన్ని ఇక్కడే విడిచి వెళుతున్నట్టుంది... రేపటికల్లా పరిస్థితులు చక్కబడేలా చేస్తాను
రిషి: ఎదురుచూస్తాను..మనం కలిసే ఆ రేపటి కోసం..ఈ రోజు నువ్వు చేసే కాల్ కోసం...
వసు: వెళ్లనా సార్
రిషి: వెళ్లొస్తాను అంటారు కదా
వసు: మీరే వస్తారు కదా...
అక్కడ నుంచి వసుధార వెళ్తుండగా రిషి బాధగా అలాగే చూస్తూ ఉంటాడు... బై ఎండీగారు అని ఇద్దరూ కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటారు...


Also Read: చారుశీల మోనితకన్నా సైకో, దీపను చంపేందుకు పక్కా ప్లాన్, ఇంద్రుడికి షాక్ ఇచ్చిన సౌందర్య
మరోవైపు జగతి బుక్కు చదువుతూ ఉండగా అక్కడికి దేవయాని వస్తుంది.
దేవయాని: ఏంటి జగతి బుక్కు చదువుతుండగా డిస్ట్రబ్ చేశానా
జగతి: పర్లేదు అక్కయ్య 
దేవయాని: నువ్వు ఇలా నిల్చోవలసిన అవసరం లేదు జగతి ఇలా కూర్చో మాట్లాడుకుందాం అని జగతిని కూర్చోబెడుతుంది. నా మనసులో చాలా బాధగా ఉంది అది నీతో పంచుకుందామని వచ్చాను. ఎందుకంటే రిషి ఆ వసుధారతో వెళ్తున్న విషయాన్ని మీరు చెప్పలేదు రిషి కూడా చెప్పలేదు .  వెనక్కి రమ్మని చెప్పి రిషికి ఫోన్ చేశాను అనడంతో జగతి షాక్ అవుతుంది. 
జగతి: అక్కయ్య ఎందుకు మీరు రిషి ఇష్టానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు కోరుకుంటున్నారు, వెళ్లాలనిపించింది వెళ్లాడు. మీరు వెనక్కి రమ్మని చెప్పడం ఏంటి అది తన ఇష్టం కదా
దేవయాని: బాగానే మాట్లాడుతున్నావు జగతి . నువ్వు లెక్చరర్ వి కదా నీలాగా నేను మాట్లాడలేకపోవచ్చు. కానీ నేను చేసే పనిలో ప్రయత్నం లోపం మాత్రం ఉండకూడదు కదా. నువ్వు నీ శిష్యురాలు కలిసి వలవేసి ప్లాన్ వేసి రిషి ని వైపు తిప్పుకోవాలనుకుంటున్నారు జగతి:  అక్కయ్య అని అరుస్తుంది
దేవయాని: ఏంటి జగతి కోపం వస్తోందా.. నేను అన్న దాంట్లో తప్పేముంది. రిషి మీదకు వసుధార ని ఉసుగొలిపింది నువ్వే కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. వసుధారని అడ్డుపెట్టుకుని రిషితో అమ్మ అని పిలిపించుకోవాలి అన్న ఆశ ఇంకా చావలేదా. రిషి భవిష్యత్ నాశనం చేస్తున్నావు నీకు రిషి అంటే ప్రేమే లేదు అనడంతో జగతి సీరియస్ అవుతుంది. 
జగతి: ఇంకోసారి నాకు రిషి మీద ప్రేమ లేదు అన్న మాటను మాట్లాడకండి అసలు మీకు రిషి మీద ప్రేమ ఉందా ఎంతసేపు రిషి ని అడ్డుపెట్టుకొని పెత్తనం చేయాలి అని చూస్తున్నారు . ఎంతసేపు అందరి మీద పెత్తనం చేయాలని చూస్తారు ఇన్ని రోజుల్లో మీ ఆలోచనలు మీ విషపు ప్లాన్లు ఏంటో నాకు తెలియదని అనుకుంటున్నారా. మీ గురించి ఒక్కసారి రిషికి చెబితే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించారా ఎందుకు ఇన్ని నాటకాలు ఆడుతున్నారు. ఇన్ని రోజులు నా జీవితంతో ఆడుకుని నన్ను మహేంద్రకు దూరం చేశారు ఇప్పుడు మళ్లీ రిషి జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నారు అని అంటుంది. నేను మీ ఇంటికి రావడం ఇష్టం లేదు. కానీ రిషి మాటమీద ఈ ఇంటికి వచ్చాను. నన్ను ఏమి చేయలేక వసుధారని అడ్డుపెట్టుకొని రిషి ని శిక్షించాలని చూస్తున్నారా 
జగతి మాటలు విని దేవయాని షాక్ అవుతుంది
జగతి: మనుషులను బంధాలను విడదీసి మీరు ఏం బాగుపడతారు అక్కయ్య. ఇన్ని రోజులు పాటు మీరు ఏం సాధించారు. ఇప్పుడు ఏం సాధించబోతున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి అని సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది జగతి. నా జోలికి రండి పర్లేదు నన్ను ఏమైనా చేయండి కానీ రిషి జోలికి వస్తే మాత్రం మర్యాదగా ఉండదు. ఏ వసుధారని అయితే మీరు చీదరించుకుని అవమానిస్తున్నారో అదే వసుధార తొందర్లోనే మీ నిజ స్వరూపం ఏంటో రిషికి తెలిసేలా చేస్తుంది అని వార్నింగ్ ఇస్తుంది
దేవయాని: జగతి మాటలకు టెన్షన్ పడుతూనే... ఏం మాట్లాడాలో తెలియక నీ సంగతి ఆ వసుధార సంగతి తొందర్లోనే తేలుస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. 


Also Read: రిషిధార ప్రేమ ప్రయాణం, గోలి సోడా - తాటితేగల గురించి రిషికి వసు స్పెషల్ క్లాస్!


మరొకవైపు వసుధార వాళ్ళ అమ్మ పూజ చేస్తూ ఉండగా వసుధార ఎంట్రీ ఇస్తుంది. కూతుర్ని చూసి తల్లి ఆనందానికి హద్దులుండవు. తండ్రి ఆశీర్వాదం కోసం వెళ్లి...యూనివర్శిటీ టాపర్ గా నిలిచాను నన్ను దీవించండి అని అడిగితే...
ఎందుకొచ్చావ్ అని ప్రశ్నిస్తాడు తండ్రి.ఆ  మాటవిని వసు షాక్ అవుతుంది