Karthika Deepam  December 24th  Episode 1544 (కార్తీకదీపం డిసెంబరు 24ఎపిసోడ్)


శౌర్య ఆలోచిస్తూ మా అమ్మ నాన్నలు ఎందుకు హైదరాబాద్ వెళ్లడం లేదు ఒకవేళ వాళ్ళు ఉంటే నానమ్మ వాళ్ళ దగ్గరే ఉండాలి కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ రాసి ఇచ్చిన స్లిప్పు చూసి దీన్ని చూస్తే అమ్మానాన్నలు బతికే ఉన్నారని అనిపిస్తుంది. బాబాయ్ అన్నట్టుగా నేను అన్నాను కాబట్టి చారుశీల మేడం ఇలా రాసిచ్చిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోని చంద్రమ్మ వచ్చి శౌర్య డల్ గా ఉండడ గమనిస్తుంది. 
శౌర్య-చంద్రమ్మ
పిన్ని అందరూ అనుకున్నట్టుగా అమ్మానాన్నలు లేరా అనడంతో ఉన్న వాళ్ళని లేరు అని చెబితే అంతకంటే పాపం మరొకటి లేదు అనుకుంటూ...నువ్వు ఉన్నావని నమ్ముతున్నావు అదే నమ్మకంతో ఉండు ఎప్పటికైనా కనిపిస్తారు అంటుంది చంద్రమ్మ. ఇంతలోని ఇంద్రుడు అక్కడికి రావడంతో బాబాయ్ హాస్పిటల్ కి వెళ్దాం పద అనగా ఎందుకమ్మా అనడంతో అదేంటి బాబాయ్ ఈ స్లిప్పు రాసిచ్చారు కదా ఒకవేళ మా నాన్నని రాసి ఆ మేడంకి ఇచ్చి వెళ్ళారేమో అని అంటుంది సౌర్య. అప్పుడు ఇంద్రుడు రేపు వెళ్దాం లే బంగారం అనడంతో ఇప్పుడే వెళ్లాలి బాబాయ్ అని అంటుంది. అప్పుడు చంద్రమ్మతో ఒక గ్లాస్ బియ్యం ఎక్కువగా పెట్టు మా నాన్న కనిపిస్తే ఇంటికి తీసుకొని వస్తాను అని అంటుంది శౌర్య. అప్పుడు ఇంద్రుడు ఏం చెప్పాలో అర్థం కాక ఆకలిగా ఉంది తిన్న తర్వాత వెళ్దాం అని చెబుతాడు.


మరొకవైపు సౌందర్య వాళ్ళు  శౌర్య దగ్గరకు వస్తుంటారు. ఈ ఊరికి అసలు నా జీవితంలో వస్తానని అనుకోలేదు అంజి. ఎక్కడో ముంబై ఢిల్లీ ఆ ప్రదేశంలో తిరిగే నేను ఈ విధంగా ఈ పల్లెటూర్లలో వెతుకుతున్నాను అంటే దేవుడు నాకు అంతా మంచే చేస్తాడని నాకనిపిస్తోంది అంటుంది సౌందర్య.


Also Read: రిషిధార ప్రేమ ప్రయాణం, గోలి సోడా - తాటితేగల గురించి రిషికి వసు స్పెషల్ క్లాస్!
 
చారుశీల-పండరి
సీన్ ఇలా రివర్స్ అయ్యిందేంటి కార్తీక్ ఇలా ఎందుకు అబద్ధం చెప్పాడు అని ఆలోచిస్తూ ఉంటుంది చారుశీల. దీప చనిపోబోతోందని న  అబద్ధం చెప్పి శాశ్వతంగా చంపేద్దామనుకుంటే ఇప్పుడు అవకాశం లేకుండా చేశాడు కార్తీక్..అందుకే ఆ ప్రాణం తీసే పనేదో నేనే చేయాలి ఎవరికీ అనుమానం రాకుండా పని పూర్తి చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే పండరి అక్కడికి రావడంతో రా పండరి నీ కోసమే ఎదురు చూస్తున్నాను అని అంటుంది. దీప ఆరోగ్యం ఎలా ఉందని ఆరాతీస్తుంది. భర్త ప్రాణాలతో బతకడు అని తెలిసాక ఏ భార్య భరించగలదని  బాధపడుతుంది. దీప పరిస్థితి బాలేదని అబద్ధం చెప్పిన చారుశీల.. ఈ మాత్రలు ఎవ్వరికీ తెలియకుండా ఇవ్వు అని ఇస్తుంది. కార్తీక్ కి కూడా తెలియకూడదని పండరికి చెబుతుంది. ఇస్తానమ్మా..దీపమ్మ ప్రాణాలు నిలబడితే చాలు అని పండరి ఆ మందులు తీసుకెళుతుంది. అది చూసి నవ్వుకుంటుంది చారుశీల.... అవి దీపమ్మ ప్రాణాలు నిలబెట్టే మందులు కాదు ప్రాణాలు తీసే మందులు..త్వరలోనే దీప గుండె ఆగిపోతుంది అనుకుంటుంది. 


సౌందర్య-శౌర్య
మరొకవైపు సౌందర్య వాళ్లు చంద్రుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు. అప్పుడు శౌర్య వాళ్ళని చూసి షాక్ అవుతుంది. తనని తీసుకెళ్లడానికి వచ్చారనుకుని నేను రాను అని మళ్లీ గోల మెదలెడుతుంది. కోప్పడిన సౌందర్య చెప్పేది వినవా.. నేను తీసుకెళ్లడానికి వచ్చానా అని మీకు చెప్పానా అని అంటుంది సౌందర్య. అప్పుడు ఆనందరావు నువ్వు రాలేదని చెప్పి మీ నానమ్మ ఇక్కడ ఉంది మనమందరం కలిసి ఇక్కడే ఉండబోతున్నాము అనడంతో ఇంద్రుడు టెన్షన్ పడతాడు. అవకాశం చూసుకుని నాతో మాట్లాడాలని ట్రై చేయకని హిమను బెదిరిస్తుంది శౌర్య...


Also Read: చారుశీలకు షాకిచ్చిన కార్తీక్, శౌర్యను చూసి పరుగుతీసిన దీప, అదే ఊరిలో సౌందర్య!


కార్తీక్-దీప
దీప జరిగిన విషయాలు తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. అడు కార్తీక్ దీపను చూసి బాధపడుతూ నన్ను క్షమించు దీప నీకు అబద్ధం చెప్పాను అనుకుంటాడు. మనం వాళ్ల దగ్గరికి వెళ్లలేము కనీసం దూరం నుంచి అయినా చూస్తాను డాక్టర్ బాబు ప్లీజ్ నన్ను తీసుకెళ్లండి అని ప్రాధేయపడడంతో సరే అని అంటాడు కార్తీక్. పగటిపూట వద్దు శౌర్య మనల్ని చూస్తుంది. రాత్రి సమయంలో అయితే బాగుంటుంది ఈ రోజు రాత్రికి తీసుకెళ్తానని మాటిస్తాడు కార్తీక్. మరొకవైపు పండరీ చారుశీల ఇచ్చిన టాబ్లెట్స్ గురించి తెలియక దీపకు కాఫీలో కలిపి ఇస్తుంది. కాఫీ ఎలాగో ఉందని దీప అడిగితే..కాఫీ పొడి మార్చానని అబద్ధం చెబుతుంది. మరొకవైపు హేమచంద్ర ( దీపకు సాయం చేసినడాక్టర్ అన్నయ్య) వాళ్ళ ఇంటికి సమీపంలో సౌందర్య వాళ్ళు కొత్త ఇంటికి వస్తారు.


సోమవారంఎపిసోడ్ లో
డాక్టర్ బాబు మనల్ని వాళ్లు చూడకూడదు కానీ మనం వాళ్లని చూడొచ్చుకదా..వాళ్ల దగ్గరకు వెళతానని గొడవ చేయను ఒక్కసారి తీసుకెళ్లండి అని అడుగుతుంది దీప.. కార్తీక్ తీసుకెళ్లి శౌర్యని చూపిస్తాడు...నా బిడ్డను నేను తెచ్చుకుంటానంటూ కారు దిగుతుంది దీప...శౌర్య చూసిందో లేదో శనివారం ఎపిసోడ్ లో తెలుస్తుంది...