బంగాళఖాతంలో శ్రీలంకకు ఈశాన్య భాగంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. ఇది మరో ప్రస్తుతానికి ఉత్తర వాయవ్య దిశగా కదిలుతోంది. సాయంత్రానికి తన దిశను మార్చుకునే అవకాశం ఉంది. దక్షిణ వైపు దిశ మార్చకోనుంది. అలా దిశ మార్చుకుంటే మాత్రం ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు 25వ తేదీ నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్ చెప్పారు.
ప్రస్తుతానికి ఏపీ తెలంగాణ ప్రాంతాలకు వర్షాలు లేవు కానీ... వాయుగుండం దిశ మార్చుకుంటే మాత్రం వర్షాలు పడే అవకాశం ఉంది. అంత వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దక్షిణ బంగాళాఖాతంలోని తేమని, ఉత్తరభారత దేశం నుంచి వచ్చే గాలులను కూడా వాయుగుండం లాక్కుంటుంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణలో చలి తీవ్రంగా ఉంటుంది.
శ్రీలంకకు సమీపంలో ఏర్పడిన వాయుగుండం ఈ సాయంత్రం నుంచి దక్షిణ నైరుతిగా కదిలే ఛాన్స్ ఉంది. ఇది చాలా బలహీన పడిపోయి... శ్రీలంక వద్ద తీరం దాటుతుందో... ఆ రోజు నుంచి వర్షాలు పడొచ్చు. అంటే 25 తేదీ నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలకు అవకాశం ఉంది. రాయలసీమకు ఆనుకొని ఉన్న తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు పడొచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలో చలి తీవ్రత తీవ్రస్థాయిలో ఉంటుంది. కుమ్రంభీం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్‌తోపాటు కామారెడ్డి, పెదపల్లి జిల్లాల్లో చలి తీవ్ర పెరుగుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువగా నమోదు అవుతాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు, విజయనగరం, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లా, కర్నూలు సహా ఇతర రాయలసీమ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతంగా ుంటుంది. నగరంలో పొగమంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలుగా నమోదు కావచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలుగా నమోదు కావచ్చు. ఈశాన్య లేదా తూర్పు దిశ నుంచి వీచే గాలులు ఇబ్బంది కలిగిస్తాయి.
తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత ఖమ్మంలో 32.6డిగ్రీలుగా నమోదు అయ్యింది. అతి తక్కువ ఉష్ణోగ్రత 11.2 డిగ్రీలు ఆదిలాబాద్‌లో రిజిస్టర్ అయిందది.